Home News International Marital Prison | ఈ ఇంటికి వెళ్తే విడాకులు తీసుకుందామన్న భార్యాభర్తలు ఇట్టే కలిసిపోతారు !!

Marital Prison | ఈ ఇంటికి వెళ్తే విడాకులు తీసుకుందామన్న భార్యాభర్తలు ఇట్టే కలిసిపోతారు !!

Marital Prison | ఈ మధ్య విడాకుల కల్చర్ ఎక్కువైపోయింది. చిన్న చిన్న కారణాలకే విడిపోదామని నిర్ణయించుకుంటున్నారు. రోజూ ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉన్నారు. అలా కలహాలు పెట్టుకునే భార్యాభర్తలను కలిపేందుకు ఒక ఇల్లు ఉంది. అందులోకి వెళ్లి ఆరు వారాలు ఉన్నారంటే.. ఎంత పెద్ద గొడవలైనా సరే సద్దుమణిగిపోతాయి. జీవితాంతం అన్యోన్యంగా కలిసి ఉంటారు. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడుందని అనుకుంటున్నారా?

రొమేనియా ( romania )లో బీర్టాన్ అనే గ్రామంలో ఒక చర్చి ఉంది. దానికి సమీపంలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది. దాని పేరు మారిటల్ ప్రిజన్. తరచూ గొడవలు పడుతూ విడాకులు ఇప్పించమని ఎవరైతే ఇక్కడి చర్చి బిషప్ వద్దకు వస్తారో.. వారిని ఆ ఇంట్లో పెట్టి గడియవేస్తారు. రెండు నుంచి ఆరు వారాల పాటు విడాకులు కావాలని వచ్చిన దంపతులను అందులో ఉంచుతారు. ఆశ్చర్యంగా ఆ ఆరు వారాల్లో దంపతులు తమ మనసు మార్చుకుని కలిసిపోతున్నారు. గత 300 సంవత్సరాల్లో వేల జంటలు ఈ ఇంట్లోకి వెళ్లగా.. ఒక్క జంట మాత్రమే విడాకులు తీసుకుంది. అందుకే విడిపోదామని అనుకున్న జంటలను ఈ మారిటల్ ప్రిజన్‌కు తీసుకొస్తుంటారు.

ఆ ఇంట్లో ఉన్న మర్మమేంటి?

బీర్టాన్ గ్రామంలో ఉన్న చర్చికి సమీపంలో కొండపైన మారిటల్ ప్రిజన్ ఉంటుంది. ఈ ఇంట్లో ఒకటే గది ఉంటుంది. అందులో ఒకటే కుర్చీ, ఒకటే టేబుల్, ఒకటే బెడ్ ఉంటాయి. దిండు, దుప్పటి ఒక్కొక్కటే ఉంటాయి. తినడానికి ప్లేటు, స్పూన్ కూడా ఒక్కటే ఉంటాయి. అంటే ఆ గదిలోకి వెళ్లిన జంట.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఏదైనా సరే షేర్ చేసుకోవాల్సిందే. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాల్సిందే. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి ప్రధాన కారణం సఖ్యత లేకపోవడం. ఒకరిపై మరొకరు ప్రేమ చూపించుకోకపోవడం. కానీ ఈ గదిలో వాళ్లకు ఆ సమయం దొరుకుతుంది. దీని వల్ల ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. మోడు వారిన తమ జీవితాల్లో మళ్లీ ప్రేమను చిగురింపజేసుకునే అవకాశం దక్కుతుంది. అందువల్లనే ఆ గదిలోకి వెళ్లొచ్చిన తర్వాత చాలామంది దంపతులు విడాకులు వద్దనే చెబుతుంటారు. ఇలా 300 ఏళ్లలో ఎన్నో జంటలను కలిపింది.ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.. ఏడు నెలలు కాకుండానే తనువు చాలించాడు..

Exit mobile version