Home Lifestyle Health Medicines | ఎక్స్‌పైరీ తేదీ దాటిన మందులు పవర్‌ కోల్పోతాయా? అలాంటి మందులు వాడొచ్చా ?

Medicines | ఎక్స్‌పైరీ తేదీ దాటిన మందులు పవర్‌ కోల్పోతాయా? అలాంటి మందులు వాడొచ్చా ?

Medicines | కరోనా తర్వాత ఎవరి ఇంట్లో చూసినా జ్వరం, దగ్గు, జలుబు ట్యాబ్లెట్లు కామనైపోయాయి. ముందు జాగ్రత్తగా తలనొప్పితో పాటు ఈ ట్యాబ్లెట్లన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాం. వాటి అవసరం రాకపోతే కొద్ది రోజుల్లోనే అవి ఎక్స్‌ఫైరీ అవుతాయి. అలాంటి సందర్భాల్లో మనకో డౌట్‌ వస్తుంది. అసలు ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్లు వాడితే ఏమవుతుంది? అలాంటి వాటిని వాడటం మంచిదేనా అనే ఆలోచన మొదలవుతుంది. అలాంటి డౌట్లకు సమాధానాలివిగో..

ఏ ట్యాబ్లెట్లు, టానిక్‌లైనా వాటిమీద ఎక్స్‌పైరీ డేట్‌ కచ్చితంగా ఉంటుంది. దానర్థం.. వాటిని ఆ తేదీలోపు వాడితే పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు భద్రత విషయంలోనూ ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. కానీ ఎక్స్‌పైరీ తేదీ దాటిన మందులు వాడాలంటే ఆలోచించాలి. ఇలాంటి డౌట్లపై అమెరికన్‌ మెడికల్ అసోసియేషన్‌ అప్పట్లో కొన్ని పరిశోధనలు చేసి కీలక విషయాలు వెల్లడించింది.

ఔషధాలు సుదీర్ఘకాలం నిల్వ ఉండటం, వాటి ప్రభావాన్ని కోల్పోకుండా ఉండగలగడం అనేది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మందులో ఉన్న పదార్థాలు, వాటిలో నిల్వ ఉంచే పదార్థాలేంటి, ఏ ఉష్ణోగ్రత వద్ద ఉంచుతున్నాం, తేమ, వెలుతురు తగిలే చోట ఉంచుతున్నామా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి ఆధారంగా ఔషధాలు సుదీర్ఘకాలం ప్రభావం కోల్పోకుండా ఉంటాయి.

ఏ ఔషధమైనా దాన్ని ప్యాక్‌ చేసిన రేపర్‌లోనో.. సీసాలోనో ఉన్నంత వరకు భద్రంగానే ఉంటుంది. ఎక్స్‌పైరి అన్నది ఆ రేపర్‌, మూతను తెరిచి ఉంచనంత వరకే వర్తిస్తుంది. ఏదేనీ కారణం చేత తెరిస్తే మాత్రం వీలైనంత త్వరగా దాన్ని వినియోగించాల్సిందే.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version