Home Lifestyle Health Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి...

Home Remedies for Cold | చలికాలంలో ముక్కు కారుతుందా? ఈ చిట్కాలతో జలుబు నుంచి ఉపశమనం పొందండి

Image by katemangostar on Freepik

Home Remedies for Cold | చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది జ్వరం, జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ సీజన్‌లో శీతల గాలుల ప్రభావానికి కొంతమందికి ఎప్పుడూ ముక్కు కారుతూనే ఉంటుంది. దీంతో ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు. ముక్కు కారుతుంటే ఏకాగ్రతతో పనిచేయలేరు. ఇంగ్లిష్ మందులు ఎన్ని వాడినా కూడా తాత్కాలిక ఉపశమనమే దొరుకుతుంది. కానీ జలుబు నుంచి పూర్తిగా బయటపడలేరు. కానీ ఆయుర్వేద పద్ధతుల్లో ఇంట్లో దొరికే ఆహారపు పదార్థాలతో జలుబు సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒకసారి చూద్దాం..

☞ జలుబు చేసినప్పుడు చాలావరకు చల్లటి నీటికి దూరంగా ఉండాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

☞ ముందుగా 7 నుంచి 8 మిరియాలను నెయ్యిలో బాగా వేయించాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి పాలల్లో వాటిని వేసుకుని తాగాలి. దీనివల్ల గొంతుకు హాయిగా ఉంటుంది.

☞ రాత్రి పడుకునే ముందు వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

☞ గుప్పెడు తులసి ఆకులను.. చిటికెడు రాళ్ల ఉప్పుతో నమిలి మింగితే జలుబు తగ్గుతుంది. తులసి ఆకులతో చేసిన టీ కూడా ఉపశమనం కలుగజేస్తుంది.

☞ పాలల్లో జాజికాయ, అల్లం, కుంకుమపువ్వు కలిపి ఉడుకబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దీనివల్ల జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.

☞ రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడగట్టి దాంట్లో కొద్దిగా తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Health Tips | రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఇదిగో ఇవి తింటే మీ సమస్య తీరినట్టే!

World’s Deadliest Diseases | ప్రపంచాన్ని భయపెట్టిన 6 అతిపెద్ద మహమ్మారులు.. టెక్నాలజీ, వైద్యులు, పరిశోధనలు లేకున్నా ఎలా అంతమయ్యాయి ?

Postpartum Hair loss | డెలివరీ తర్వాత జుట్టు ఊడిపోతుందా? ఈ టిప్స్‌ మీకోసమే..

Bone Health | ఎముకలు బలంగా కావాలంటే.. రోజూవారీ భోజనంలో వీటిని తప్పనిసరి చేసుకోవాలి!

Exit mobile version