Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు ( 12-04-2023 )

Horoscope Daily | రాశిఫలాలు ( 12-04-2023 )

Horoscope Daily | మేషం

సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. షేర్లు, భూములు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృషభం

ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగవకాశాలు వస్తాయి.

మిథునం

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సంతానం విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూములు, క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సంతానానికి విద్య, ఉద్యోగవకాశాలు కలిసి వస్తాయి.

సింహం

అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూర ప్రయాణాల్లో నూతన మిత్రులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు వింటారు.

తుల

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

వృశ్చికం

భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటాయి.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం కలదు.

మకరం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వస్తు లాభం పొందుతారు.

కుంభం

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం

మిత్రుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News