Palmistry | మన దేశంలో రాశి ఫలాలను ఎంతగా నమ్ముతారో.. అంతగానే హస్త సాముద్రిక ( Hasta Samudrika Shastram ) శాస్త్రాన్ని విశ్వసిస్తారు. మన చేతిలోని రేఖలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఎన్నో ఏండ్లుగా ఒక నమ్మకం ఉంది. చెయ్యి చూసి జాతకాలు చెప్పే ఈ పామిస్ట్రీ ( Palmistry ) భారత దేశంలోనే కాదు టిబెట్, చైనా, రష్యా, బాబిలోనియా, సుమేరియా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లోనూ ప్రాచుర్యం పొందింది. హస్త సాముద్రిక శాస్త్రంలో లైఫ్, హార్ట్, ఫేట్, మ్యారేజ్, హెడ్ అనే ఈ రేఖల ద్వారా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటారు. వీటిలో ముఖ్యంగా హార్ట్ లైన్ ( Heart Line ) మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని హస్త సాముద్రిక నిపుణులు ప్రముఖంగా చెబుతుంటారు. మరి హార్ట్ లైన్ ఎలా ఉంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మన రెండు అర చేతులు కలిపినప్పుడు వచ్చే ఆకారాన్నే హార్ట్ లైన్ అని పిలుస్తారు. దీన్నే లవ్ లైన్ అని కూడా అంటుంటారు. ఈ లైన్ ఉన్న పరిమాణాన్ని ఆధారంగా చేసుకుని మన భవిష్యత్తుతో పాటు వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చని హస్త సాముద్రిక నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా చాలామందికి ఈ హార్ట్ లైన్ రెండు చేతుల్లో ఒకేలా ఉంటుంది. ఎవరో వందలో ఒకరిద్దరికి మాత్రమే విభిన్నంగా ఉంటుంది. అయితే రెండు అరచేతులను కలిపినప్పుడు ఈ హార్ట్ లైన్ ఒక్కొకరికి ఒక్కో ఆకారంలో కనిపిస్తుంది. స్ట్రెయిట్‌గా కలవడం, అర్ధ చంద్రాకారంలో కలవడం, అసలు కలవకపోవడం జరుగుతుంది. ఇలా రెండు చేతులను కలిపినప్పుడు హార్ట్ లైన్ ఏర్పడిన ఆకారాన్ని బట్టి మనుషుల స్వభావం, భవిష్యత్తు అంచనా వేస్తారు.
? రెండు చేతుల్లోని హార్ట్ లైన్ కలిసి స్ట్రెయిట్‌గా గీతలా ఏర్పడితే ఆ వ్యక్తులు చాలా ప్రశాంతంగా ఉంటారు. సున్నిత స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు. అరెంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు. వీళ్లను చాలా అదృష్టవంతులని చెబుతుంటారు.
? హార్ట్ లైన్ అస్తవ్యస్తంగా ఏర్పడితే వాళ్లు జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వివిధ సమస్యల్లో కూరుకుపోతారు. ఒక పద్ధతి పాటించరు. ప్రతి ఒక్కరినీ తమకు దగ్గరగా ఉంచుకోవాలని ఆశపడతారు. ఇలా అస్తవ్యస్త గీతలు ఉన్నవారిలో 80 శాతం మంది తమ కంటే వయసులో కొంచెం పెద్దవాళ్లను పెళ్లి చేసుకుని స్థిరపడటానికి ఇష్టపడుతుంటారు.
? రెండు చేతులు కలిపినప్పుడు అర్ధ చంద్రాకారంలో హార్ట్ లైన్ ఏర్పడితే వాళ్లు స్ట్రాంగ్ మైండ్ కలిగి ఉంటారు. వారికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుంది. వీళ్లు చాలా ప్రేమ కలిగి ఉంటారు. ఇతరులకు ప్రేమను పంచుతారు తప్ప తిరిగి వాళ్ల నుంచి ఏమీ ఆశించరు. చూడ్డానికి కూడా వీళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్లు చిన్ననాటి స్నేహితులతోనే జీవితాన్ని పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read More Articles:
Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?
Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?