Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (06-04-2023)

Daily Horoscope | రాశిఫలాలు (06-04-2023)

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. షేర్లు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

వృషభం

బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. మెలుకువ చాలా అవసరం. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ధనలాభం పొందుతారు.

మిథునం

రుణ ఒత్తిడుల నుంచి విముక్తి చెందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త వస్తువులు సేకరిస్తారు.

కర్కాటకం

మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి. స్థలాల కొనుగోలు యత్నాలు చేస్తారు.

సింహం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎధురైనా అధిగమిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ధన లాభం పొందుతారు.

తుల

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన వస్తువులు సేకరిస్తారు..

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. వాహన యత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు

వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగుల్లో స్థానచలన మార్పులు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.

మకరం

ప్రయాణాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తీరుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మీనం

జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version