Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు (19-12-2022)

Horoscope Today | రాశి ఫలాలు (19-12-2022)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలుచేస్తారు. గృహ నిర్మాణ ఆలోచన చేస్తారు.

వృషభం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. నూతన ఉత్సాహంతో పని పూర్తి చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. వస్తు లాభ సూచన ఉంది.

మిథునం

మిత్రులతో ఏర్పడిన విబేధాలు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యంపట్ల మెలుకువ అవసరం. ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటకం

ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

సింహం

పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగుతాయి.

కన్య

నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

తుల

బంధువులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

వృశ్చికం

మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరిగినా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. భూ వాహన యోగం పొందుతారు.

మకరం

కుటుంబసభ్యులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులు పదోన్నతులు పొందే సూచన. వస్తువులు కొనుగోలు చేసే సూచన ఉంది.

కుంభం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా మిత్రుల సాయం అందుతుంది. కుటుంబసభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభ సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version