horoscope today | మేషం
పనులు నత్తనడకన సాగుతాయి. ఇంటాబయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
వృషభం
కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. అనారోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.
మిథునం
విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. వివాహ యత్నాలకు సాగిస్తారు. సంతానం సమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటకం
పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన సమయం. కాంట్రాక్టులు దక్కుతాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వస్తు సేకరణ సూచన ఉంది.
సింహం
శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు కొంతవరకు తీరుతాయి. పనుల్లో జాప్యం ఏర్పడినా చివరకు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆహ్వానాలు అందుకుంటారు.
horoscope today కన్య
రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. పనుల్లో ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొన్ని తీరుతాయి. అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. వాహన సౌఖ్యం కలదు.
తుల
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. భూవివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు. సాంకేతిక విద్య అందే సూచన ఉంది.
వృశ్చికం
మిత్రులతో ఏర్పడిన విబేధాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ముఖ్య వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో ఒడిదొడుకులు తొలగుతాయి.
ధనుస్సు
ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన మిత్రుల పరిచయం సాయం అందిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులను కలుసుకుంటారు.
మకరం
కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ చాలా అవసరం. శ్రమ అధికం అవుతుంది. దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధనలాభ సూచన ఉంది.
కుంభం
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది. నూతన వస్తువులు సేకరిస్తారు.
horoscope today మీనం
దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. దైవ దర్శనాలు చేసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం కలదు.
Read More Articles:
Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు
Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!
Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?
Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?