Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHealthLemon juice | చలికాలంలో నిమ్మ రసం తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Lemon juice | చలికాలంలో నిమ్మ రసం తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Lemon juice | నిమ్మ రసం అంటే ఎండాకాలంలోనే తాగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. లెమన్‌ జ్యూస్‌ తాగితే డీహైడ్రేషన్‌ తగ్గి.. తక్షణ శక్తి వస్తుంది. అందుకే వేసవి కాలంలో నిమ్మ రసం ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇది ఎండాకాలం కంటే కూడా చలికాలంలో ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో ఒత్తిడి, మానసిక ఆందోళనలు సతమతం చేస్తుంటాయి. శ్వాస కోశ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే ఇవన్నీ తగ్గి రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ సీజన్‌లో ప్రతిరోజు నిమ్మ రసం తాగాలని అంటున్నారు వైద్య నిపుణులు. పరిగడుపున గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు.

➣ చలికాలంలో చర్మం తేమను కోల్పోయి తొందరగా పొడిబారిపోతుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల చర్మంలో తేమ అలాగే ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు నల్ల మచ్చలను తగ్గిస్తుంది. వృద్దాప్య ఛాయలను తొలగిస్తుంది. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తారు.

➣ శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. పరిగడుపున నిమ్మరసం తాగడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

➣ సాధారణంగా చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. రోజూ లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీనివల్ల చలికాలంలో కామన్‌గా ఎదురయ్యే ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ఎదుర్కోవచ్చు.

➣ ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల జీవక్రియ ( మెటబాలిజం ) మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు తగ్గవచ్చు.

➣ కిడ్నీలో రాళ్లు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నిమ్మరసం తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Padmasana | పద్మాసనం ఎలా వేయాలి? ఈ యోగాసనం వేస్తే కలిగే ప్రయోజనాలేంటి?

Health Tips | ఈ లక్షణాలుంటే లివర్‌ జబ్బుగా అనుమానించొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు!

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News