Tuesday, March 19, 2024
- Advertisment -
HomeLifestyleHealthCold remedies | చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే..

Cold remedies | చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే..

Cold remedies | సీజన్‌ మారినప్పుడు జబ్బుల బారిన పడటం సహజమే. చలికాలంలో కొందరికి ఇట్టే జలుబు చేస్తుంది. ముక్కు దిబ్బడ మొదలవుతుంది. పైగా కొందరికి జలుబుతో పాటు దగ్గు కూడా వస్తుంటుంది. ఇంగ్లిష్‌ మందులు ఎన్ని వాడినా కూడా ఈ జలుబు, దగ్గు అంత తొందరగా తగ్గవు. దీంతో ఏ పని చేయాలన్నా ఏకాగ్రత ఉండదు. చికాకుగా అనిపిస్తుంటుంది. అయితే ఇంట్లో దొరికే కొన్ని ఆహార పదార్థాలతోనే జలుబు, దగ్గును కంట్రోల్‌ చేయొచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందామా..

జలుబు తగ్గాలంటే..

➣ గ్రీన్‌ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంఆ ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన బ్యాక్టీరియ, ఇతర సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. రోజూ రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్‌ టీ తాగడం ద్వారా జలుబు తగ్గుతుంది.

➣ వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని పూటకు ఒక వెల్లుల్లి రెబ్బ చొప్పున తింటే జలుబు ఇట్టే మాయమవుతుంది.

➣ నారింజ, సిట్రస్‌ పండ్లలో ఉండే విటమిన్‌ సీ, యాంటీఆక్సిడెంట్లు జలుబు తగ్గడంలో సహాయపడతాయి.

➣ జలుబుకు కారణమయ్యే ఫ్లూ వైరస్‌లను నియంత్రించడంలో పుట్ట గొడుగులు చక్కగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

➣ వీటితో పాటు పసుపు, అల్లం రసం, గుమ్మడికాయ విత్తనాలు, క్యారెట్లు తినడం ద్వారా కూడా జలుబు తగ్గుతుంది.

దగ్గును ఇలా కంట్రోల్‌ చేయండి

ఒక గ్లాస్‌ గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్లాస్‌ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగిన పలితం ఉంటుంది. హెర్బల్‌ టీ తాగినా కూడా దగ్గు అదుపులోకి వస్తుంది. లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం రసం, మిరియాలు వేసి తయారు చేసిన మసాలా టీ తాగడం ద్వారా కూడా దగ్గు తగ్గుతుంది. పుదీనా ఆకులు వేసి మరిగించిన నీటిని తాగితే కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. పైనాపిల్‌లో ఉండే బ్రొమెలిన్‌ దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Padmasana | పద్మాసనం ఎలా వేయాలి? ఈ యోగాసనం వేస్తే కలిగే ప్రయోజనాలేంటి?

Health Tips | ఈ లక్షణాలుంటే లివర్‌ జబ్బుగా అనుమానించొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు!

Health Tips | నోటి నుంచి దుర్వాసన వస్తోందా.. కారణాలు ఇవే కావచ్చు! ఒకసారి చెక్ చేసుకోండి..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News