Home Lifestyle Do you know Smartphone hacks | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదు మార్పులు గమనించారా? అయితే మొబైల్‌ హ్యాక్‌...

Smartphone hacks | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదు మార్పులు గమనించారా? అయితే మొబైల్‌ హ్యాక్‌ అయినట్టే

Smartphone hacks | అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోనే ఇప్పుడు అన్నీ అయిపోయాయి. కాల్స్, మెసేజ్‌ చేయడం నుంచి మొదలుపెడితే పర్సనల్‌ డేటాను స్టోర్‌ చేయడం, బ్యాంక్‌ లావాదేవీలు నిర్వహించడం వరకు ప్రతి పనికీ ఈ చిన్న గ్యాడ్జెట్‌పైనే ఆధారపడుతున్నారు. అంతలో మనిషి జీవితంలో మమేకమైపోయింది. అలాంటి మొబైల్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతే ఎలా? మన వ్యక్తిగత సమాచారంతో పాటు డబ్బులు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అదే మన మొబైల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసిన విషయాన్ని కాస్త ముందుగా గుర్తిస్తే కొంతలో కొంతైనా నష్టపోకుండా కాపాడుకోవచ్చు.

సాధారణంగా మొబైల్‌ మన మాట వినదు. మనం ఒకటి నొక్కితే ఇంకొక్కటి ఓపెన్‌ అవుతుంది. దానంతట అదే అప్‌డేట్‌ అవుతుంది. లేదంటే అది ఆగిపోయిందని అనుకుంటాం. కానీ అది హ్యాంగ్‌ అవ్వడం కాదు హ్యాక్‌ అవ్వడమని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు హ్యాకింగ్‌ గురైనప్పుడు మొబైల్‌లో పలు మార్పులను గమనించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మనం మొబైల్‌ను వాడకుండానే డేటా అంతా అయిపోతుంది. అది నెట్‌వర్క్‌ ప్రాబ్లెం అని అనుకుంటూ ఉంటాం. కానీ మన మొబైల్‌లోకి హ్యాకర్లు చొరబడి డేటాను యూజ్‌ చేసినప్పుడు మాత్రమే డేటా త్వరగా అయిపోతుందనే విషయాన్ని గమనించాలి. మన డేటా సైబర్‌ నేరగాళ్లు యాక్సెస్‌ చేస్తున్నారని గుర్తించాలి. అలాంటప్పుడు వెంటనే ఫోన్‌ ఫార్మాట్‌ చేసుకోవాలి. సోషల్‌ మీడియా, బ్యాంక్‌ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకోవడం ఉత్తమమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మీ మొబైల్‌ నుంచి అకస్మాత్తుగా ఏదో ఒక నంబర్‌కు కాల్స్‌ వెళ్తున్నా అప్రమత్తం అవ్వాలి. ఒకటే నంబర్‌కు పదే పదే కాల్స్‌ డయల్‌ చేయబడుతున్నాయంటే హ్యాకింగ్‌కు గురై ఉండొచ్చనదానికి సంకేతమే. అలా మీ ప్రమేయం లేకుండా పదే పదే కాల్స్‌ వెళ్తుంటే వెంటనే స్మార్ట్‌ఫోన్‌ను కాసేపు స్విచ్ఛాఫ్‌ చేయాలి.

స్మార్ట్‌ఫోన్‌లో ఏదో ఒక యాప్‌ ఓపెన్‌ చేసి వాడుతున్నారు. అలాంటి సమయంలో వేరే యాప్‌ దానంతట అదే ఓపెన్‌ అయితే కూడా జాగ్రత్త పడాలి. అప్పుడు సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే దానికి సంకేతం కూడా కావచ్చు. అలాంటప్పుడు మనం ఏదైనా యాప్‌ ఓపెన్‌ చేసి వాడితే దానికి సంబంధించిన సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉంటుంది.

మొబైల్‌ను వాడుతున్నప్పుడు ఆటోమేటిగ్గా రీస్టార్ట్‌ అవ్వడం.. లేదా స్క్రీన్‌ ఆఫ్‌ అవుతూ ఆన్‌ అవ్వడం జరిగితే కూడా హ్యాక్‌ చేయబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా జరుగుతుంటే వెంటనే మొబైల్‌ను స్విచ్ఛాఫ్‌ చేయాలి.

ఇలాంటివి గమనిస్తే ఏం చేయాలి?

ఈ మార్పులు గమనిస్తే మన మొబైల్‌ డేటా పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లకుండా స్విచ్ఛాఫ్‌ చేయాలి. తర్వాత మొబైల్‌లో ఏవైనా హిడెన్‌ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ అయ్యాయో చెక్‌ చేసుకోవాలి. కుదిరితే వాటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి.. హిడెన్‌ యాప్స్‌ కనిపించకపోతే ఫార్మాట్‌ చేసుకోవడం బెటర్‌ అని సైబర్‌ నిపుణులు సూచిస్తారు. అలాగే సోషల్‌ మీడియా అకౌంట్స్‌తో పాటు బ్యాంకింగ్‌ యాప్స్‌ పాస్‌వర్డ్‌లను కూడా మార్చుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Exit mobile version