Home Technology World’s smallest tv | వేలంతా కూడా లేని బుల్లి టీవీ.. దీని ధర ఎంతో...

World’s smallest tv | వేలంతా కూడా లేని బుల్లి టీవీ.. దీని ధర ఎంతో తెలుసా

World’s smallest tv | ఒకప్పుడు టీవీ అంటే పోర్టబుల్ సైజ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రెస్టేజియస్గా మారిపోయాయి. ఎదుటివారి కంటే నాలుగు అంగుళాలు ఎక్కువే ఉండాలని పెద్ద పెద్ద టీవీలను కొంటున్నారు. అందుకే ఇప్పుడు 60 అంగుళాలు, 75 అంగుళాల టీవీలు కూడా వచ్చేశాయి. టీవీ తయారీల కంపెనీలు కూడా చిన్న టీవీలను వదిలేసి.. పెద్ద టీవీల తయారీపైనే ఫోకస్ చేస్తున్నాయి. కానీ అమెరికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం బుల్లి టీవీని తయారు చేసింది. ఆ టీవీ ఎంత చిన్నది అంటే చిన్న పోస్టల్ స్టాంప్ సైజులో ఉంటుంది. అంటే మన చేతి వేలిపై కూడా దాన్ని నిలబెట్టొచ్చన్నమాట.

అందరూ పెద్ద టీవీలను తయారుచేస్తుంటే వాళ్లందరికీ భిన్నంగా బుల్లి టీవీలను తయారు చేయాలని అమెరికాకు చెందని టైనీ సర్క్యూట్స్ అనే కంపెనీ భావించింది. తమ ప్లాన్లో భాగంగా రెండు నమూనా టీవీలను తయారు చేసింది. వీటిలో ఒకటి అంగుళం స్క్రీన్తో ఉండగా.. మరొకటి కేవలం 0.6 అంగుళాలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇంత చిన్న టీవీకి ఛానళ్లు మార్చుకునేందుకు, సౌండ్ అడ్జస్ట్ చేసుకునేందుకు పాత టీవీలకు ఉన్నట్టుగా నాబ్లను కూడా సెట్ చేసింది. అయితే ఈ టీవీలో మనం కేబుల్ ఛానళ్లు చూడటం కుదరదు. ముందుగానే ఇన్స్టాల్ చేసిన వీడియోలు చూడొచ్చు. అలాగే మెమొరీ కార్డు ద్వారా వీడియోలను చూడొచ్చు. అవన్నీ ఓకే కానీ.. ఈ బుల్లి టీవీ ధర ఎంత అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ టీవీ ధర నాలుగు నుంచి ఐదు వేల వరకు మాత్రమే ఉంటుందట.

Follow Us : FacebookTwitter

Read More :

Keerthi bhat | ఈ స్థాయికి రావడానికి ఏదో చేసి ఉంటా అనుకున్నాడు.. అనుమానంతో బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ కీర్తి ఎమోషన్‌

Exit mobile version