Saturday, January 28, 2023
- Advertisment -
HomeLifestyleDevotionalSakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?

Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?

Sakthivanesvara Temple | దేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత కచ్చితంగా ఉంటుంది. అలాగే తమిళనాడులోని ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ పూజలు చేస్తే దంపతుల మధ్య కలహాలు దూరమవుతాయని, ప్రేమికులు తమకు నచ్చిన వాళ్లనే పెళ్లి చేసుకుంటారని భక్తుల విశ్వాసం. అందుకే దంపతులు, పెళ్లికాని యువతీ యువకులు ఇక్కడికి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తుంటారట. ఇంతకీ ఎక్కడుంది ఆ ఆలయం.. దాని విశేషాలేంటో ఓ సారి లుక్కేయండి..

తమిళనాడులోని కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో తిరుశక్తిమట్టం అనే గ్రామంలో శక్తివనేశ్వర దేవాలయం ఉంది. ఇక్కడ శివుడు పార్వతి కలిసి శివలింగాకారంలో ఉంటారు. చూడటానికి చిత్రంగా ఉంటుంది.

క్రీ.శ 1000లో ఉత్తమ చోళుడి తల్లి సెంబియన్ మాదేవి ఈ శక్తివనేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం కుంభకోణంలోని మిగిలిన దేవాలయాలతో పోలిస్తే పరిమాణంలో చిన్నగా ఉంటుంది.

పార్వతి తపస్సు ఫలితమే..

పార్వతి ఒకరోజు శివున్ని చూసి.. అతనే తన భర్త అని భావిస్తుంది. ఇక ప్రతి క్షణం మహాశివుని గురించే ఆలోచిస్తూ అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పరమశివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడే ఘెర తపస్సు చేసింది. అయినా పరమేశ్వరుడు కరుణించకపోవడంతో ఒంటిపూట మాత్రమే భోజనం చేస్తూ స్వామిని పూజించింది. ఫలితం లేకపోవడంతో పూర్తిగా భోజనం మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు కొనసాగించింది.

ఒంటి కాలు పై…

ఆ తరువాత ఒంటికాలు పై నిలబడి రెండు చేతులూ పైకెత్తి తన తపస్సును కొనసాగించింది. అయినా శివుడు ప్రసన్నం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా అగ్నిగుండం మధ్యలో నిలబడి ఆ త్రినేత్రుడి గురించి తపస్సు కొనసాగించింది. ఇలా దాదాపు కొన్ని సంవత్సరాలు పట్టువిడువకుండా పార్వతీ దేవి పరమేశ్వరుడి గురించి తపస్సు చేసింది.

పార్వతీ దేవి పట్టుదలకు ముగ్దుడైన శివుడు అగ్నిజ్వాల రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు.

దీంతో పార్వతిదేవి తన ఎదుట ఉన్నది ఆ పరమశివుడేనని గ్రహించి ఆయనను చల్లబరచడానికి గట్టిగా కౌగిలించుకుంటుంది. వెంటనే పరమశివుడు చల్లబడి శివలింగం రూపం దాలుస్తాడు. ఆ భంగిమను మనం ఇప్పటికీ ఈ దేవాలయంలో చూడవచ్చు. మూలవిరాట్టు కూడా ఇదే స్థితిలో మనకు కనిపిస్తాడు. ఇక ఇక్కడ స్వామిని వనేశ్వర్ అని పిలుస్తారు. అమ్మవారు స్వామిని కౌగిలించుకున్న ప్రదేశం కావడం వల్ల దీనిని తిరుశక్తిముత్రం అని పిలుస్తారు.

ఈ ఆలయానికి రెండు ప్రాకారాలు ఉన్నాయి. మొదటి ప్రాకారంలో వల్లభ గణపతి, వసంత మండపం, నందీశ్వరుడి విగ్రహాలను చూడవచ్చు. రెండవ ప్రాకారంలో వినాయకుడు, మురుగన్, సోమస్కందార్ మొదలైన ఉపాలయాలు ఉన్నాయి. వీటితో పాటు అమ్మ పెరియనాయకి ఉపాలయం పెద్దదిగా ఉంటుంది.

ఆలయ అభివృద్ధిలో విజయనగర రాజులు

రాజరాజ చోళుడు 2, కుళోత్తుంగ చోళుడు 3, విజయనగర రాజులు ఈ దేవాలయం అభివృద్ధికి కృషి చేశారు. దేవాలయంలోని రాతి, రాగి శాసనాల్లో ఈ విషయాల గురించి ఉంటుంది. పెళ్లికాని అమ్మాయిలు, అబ్బాయిలు తమకు మంచి భాగస్వామి దొరకాలని ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా మనస్పర్థలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు, విడాకులు తీసుకున్న భార్యాభర్తలు కూడా ఇక్కడ స్వామివారిని కొలుస్తారు. భార్యాభర్తలిద్దరూ లేదా ఎవరైనా ఒక్కరు ఈ దేవాలయం ప్రాంగణాన్ని శుభ్రం చేసి స్వామికి అభిషేకం చేస్తే వారి ఇబ్బందులన్నీ తొలిగిపోతాయని నమ్మకం. అందుకే ఇక్కడకు దంపతులే ఎక్కువగా వస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tuesday| మంగళవారం పసుపు కుంకుమ కింద పడితే అశుభమా?

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News