Saturday, April 27, 2024
- Advertisment -
HomeEntertainmentKGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

KGF Chapter3 | బాహుబలి తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా అటెన్షన్ క్రియేట్ చేసింది కేజీఎఫ్ మూవీ. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ సినిమా ఇండస్ట్రీ స్థాయిని మరో ఖ్యాతికి తీసుకెళ్లింది. రాఖీ భాయ్‌గా యశ్ స్టైల్‌ను, ఆటిట్యూడ్‌ను చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కేజీఎఫ్ అంటే రాఖీ భాయ్.. రాఖీ భాయ్ అంటే యశ్ అనేంతలా పాపులారిటీ పొందాడు. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 చూసిన జనాలకు ఈ ప్రాంచైజీ నుంచి మరిన్ని సినిమాల్లో రాఖీ భాయ్ అడ్వెంచర్స్ చూడాలని ఆడియన్స్ ఆశపడ్డారు. దీనికి తగ్గట్టే సీక్వెల్స్ ఉంటాయని కేజీఎఫ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ప్రకటించారు. దీంతో చాప్టర్ 3 ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆశపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేజీఎఫ్ సినిమాపై బాంబు పేల్చాడు ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్.

కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజైన తర్వాత యశ్ వేరే ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. పైగా తన లుక్ కూడా ఏ మాత్రం మార్చలేదు. దీంతో వీలైనంత త్వరగానే కేజీఎఫ్ చాప్టర్ 3 తెరకెక్కుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు మరో రెండేళ్లు పట్టనుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ అధినేత విజయ్ కిరంగదూర్ తాజాగా వెల్లడించాడు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడని.. అది పూర్తయిన తర్వాతనే కేజీఎఫ్ చాప్టర్ 3 పై దృష్టిపెట్టనున్నట్టు విజయ్ తెలిపాడు. దాదాపు 2025లో ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపాడు.

అంతేకాదు కేజీఎఫ్ చాప్టర్ 3 నుంచి రాఖీ భాయ్ స్థానంలో యశ్‌కు బదులు మరో హీరో ఉండే అవకాశాలు ఉన్నాయని బాంబు పేల్చాడు. జేమ్స్‌బాండ్ సినిమా తరహాలో ప్రతిసారి కేజీఎఫ్ ప్రాంచైజీలో హీరోలు మారుతుంటారని పేర్కొన్నాడు. ఈ వార్త వినగానే కేజీఎఫ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు యశ్ ప్లేస్‌లో వేరే హీరోను రాఖీ భాయ్‌గా ఊహించుకోగలమా? వేరే హీరో వస్తే యశ్ రేంజ్‌లో ఆకట్టుకోగలడా? అని సినీ అభిమానులు అయోమయంలో పడిపోయారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News