Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuDaily Horoscope | రాశిఫలాలు (04-04-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (04-04-2023 )

Daily Horoscope | మేషం

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం కలదు.

వృషభం

అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలుగజేస్తాయి. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది.

మిథునం

రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తండ్రి నుంచి ఆస్తి లాభం పొందుతారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం

అనుకోని ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.

కన్య

ఆర్థిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి, ప్రభుత్వ రంగాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

తుల

ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు.

వృశ్చికం

అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ యత్నాలు కలిసివస్తాయి.

ధనుస్సు

కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మకరం

రుణాలు తీరి ఊరట చెందుతారు. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. పట్టుదలతొ ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

కుంభం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. షేర్ల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News