Shah Rukh Khan | కొందరు అభిమానులు తమ ఫేవరేట్ హీరోను ఒక్కసారైనా కలవాలని అనుకుంటుంటారు. అందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో జైలు పాలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అలాంటి సంఘటనే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ఎదురైంది. షార్క్ ఖాన్‌ను చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు. షారుక్ ఖాన్‌ను చూడాలనే కోరికతో వారు అత్యుత్సాహం ప్రదర్శించి, చివరకు పోలీస్ స్టేషన్ గడప తొక్క వలసి వచ్చింది. ఈ సంఘటన గత వారం చోటు చేసుకున్నది.
గుజరాత్‌కు చెందిన పఠాన్ సాహిల్ సలీమ్ ఖాన్ (18), అతని స్నేహితుడు రామ్ సరఫ్ కుశువ (19) బాద్ షాను చూడాలని భావించారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ హీరో నివాసం మన్నత్ లోకి జొరబడ్డారు. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మరీ మార్చి 1వ తేదీన ఆర్ధరాత్రి దాటిన తర్వాత వీరు ఆ బంగ్లాలోకి ప్రవేశించారు. రాత్రి మూడు గంటలకు బిల్డింగ్ లోకి వచ్చిన వారు ఉదయం 10 .30 నిమిషాల వరకు అక్కడే ఉన్నారు.
మూడో అంతస్తులో హీరో మేకప్ గదిలో దాదాపు ఎనిమిది గంటల పాటు దాక్కున్నారు. ఉదయం వీరిని చూసి షాక్ కు గురైన షారుక్ ఖాన్ పనివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో హీరోను చూడాలనే ఉద్దేశ్యంతోనే వారు ఇంట్లోకి జొరబడినట్లుగా గుర్తించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!