Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentShah Rukh Khan | షారూక్‌ ఇంట్లో దొంగచాటుగా దూరిన అభిమానులు.. 8 గంటలు ఉన్నారు.....

Shah Rukh Khan | షారూక్‌ ఇంట్లో దొంగచాటుగా దూరిన అభిమానులు.. 8 గంటలు ఉన్నారు.. చివరికి ఏమైందంటే !

Shah Rukh Khan | కొందరు అభిమానులు తమ ఫేవరేట్‌ హీరోను ఒక్కసారైనా కలవాలని అనుకుంటుంటారు. అందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో జైలు పాలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అలాంటి సంఘటనే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఫ్యాన్స్‌కు ఎదురైంది. షార్‌క్‌ ఖాన్‌ను చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు. షారుక్ ఖాన్‌ను చూడాలనే కోరికతో వారు అత్యుత్సాహం ప్రదర్శించి, చివరకు పోలీస్ స్టేషన్ గడప తొక్క వలసి వచ్చింది. ఈ సంఘటన గత వారం చోటు చేసుకున్నది.

గుజరాత్‌కు చెందిన పఠాన్ సాహిల్ సలీమ్ ఖాన్ (18), అతని స్నేహితుడు రామ్ సరఫ్ కుశువ (19) బాద్ షాను చూడాలని భావించారు. అనుకున్నదే తడవుగా బాలీవుడ్ హీరో నివాసం మన్నత్ లోకి జొరబడ్డారు. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మరీ మార్చి 1వ తేదీన ఆర్ధరాత్రి దాటిన తర్వాత వీరు ఆ బంగ్లాలోకి ప్రవేశించారు. రాత్రి మూడు గంటలకు బిల్డింగ్ లోకి వచ్చిన వారు ఉదయం 10 .30 నిమిషాల వరకు అక్కడే ఉన్నారు.

మూడో అంతస్తులో హీరో మేకప్ గదిలో దాదాపు ఎనిమిది గంటల పాటు దాక్కున్నారు. ఉదయం వీరిని చూసి షాక్ కు గురైన షారుక్ ఖాన్ పనివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో హీరోను చూడాలనే ఉద్దేశ్యంతోనే వారు ఇంట్లోకి జొరబడినట్లుగా గుర్తించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News