Home Entertainment Sudheer varma | టాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం

Sudheer varma | టాలీవుడ్ యువ నటుడు బలవన్మరణం

Sudheer varma | టాలీవుడ్ యువ నటుడు సుధీర్‌ వర్మ తన వ్యక్తిగత సమస్యలతో విశాఖ పట్టణంలో తన వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సెకండ్‌ హ్యాండ్‌, కుందనపు బొమ్మ సినిమాలతో పాటు షూట్‌ అవుట్‌ ఎట్ ఆలేరు వంటి వెబ్‌ సీరిస్‌ లో సుధీర్‌ కీలక పాత్రలు పోషించాడు.

సుధీర్‌ మరణం జీర్ణించుకోలేనిదంటూ అతని సహ నటుడు, హీరో సుధాకర్‌ కొమాకుల సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. అయితే యువనటుడు సుధీర్‌ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

యువ నటుడి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాలు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతోనే నటుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version