Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentPuri jagannath | పూరికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి కండిషన్స్ అప్లై అంటున్న చిరంజీవి..

Puri jagannath | పూరికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి కండిషన్స్ అప్లై అంటున్న చిరంజీవి..

Puri jagannath | లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ వైపు చూడడానికి హీరోలు ఆలోచిస్తున్నారు. నిర్మాతలు భయపడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా అంత దారుణంగా డిజాస్టర్ కావడంతో పూరి రేంజ్ పడిపోయింది. అందుకే లైగర్ ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా మొదలు పెట్టలేకపోయాడు పూరీ జగన్నాథ్.

ఆ సినిమా విడుదలకు ముందు మొదలు పెట్టిన జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఒకరిద్దరు బాలీవుడ్ హీరోల కోసం ప్రయత్నించినా పూరి జగన్నాథ్ కు నిరాశ తప్ప మరోటి ఎదురు కాలేదు. దాంతో పాటు తెలుగులో కొంతమంది హీరోలకు కథ చెప్పడానికి చూసినా కనీసం ఆయనకు టైమ్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో చిరంజీవి నుంచి పూరి జగన్నాథ్ కు కొండంత భరోసా వచ్చింది. నువ్వు కథ సిద్ధం చెయ్ నేనున్నాను.. సినిమా చేస్తాను అంటూ మాట ఇచ్చాడు మెగాస్టార్.

దాంతో చిరంజీవి కోసం కథ సిద్ధం చేసే పనిలోపడ్డాడు పూరి జగన్నాథ్. ఈయనతో పాటు బాలకృష్ణ కూడా ఈ సీనియర్ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. కాకపోతే ఇప్పుడు బాలయ్య చాలా బిజీగా ఉండడంతో మరో రెండేళ్ల వరకు పూరి, బాలయ్య కాంబినేషన్ ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతానికి చిరంజీవి సినిమాపై దృష్టి పెట్టాడు పూరీ జగన్నాథ్.

ఇదిలా ఉంటే మెగాస్టార్ ఆఫర్ ఇచ్చిన కూడా అదిరిపోయే కండిషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. తనకు కావాల్సిన స్క్రిప్ట్ కేవలం 30 రోజుల్లో సిద్ధం చేసి తీసుకురావాలని పూరి జగన్నాథ్ కు కండిషన్ పెట్టాడు మెగాస్టార్. అంతేకాదు ఆ సినిమా కోసం తాను కేవలం 30 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇస్తారని మరో కండిషన్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఈ రెండు కండిషన్స్ కు ఓకే అంటే.. కథ నచ్చితే వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి మెగాస్టార్ రెడీగా ఉన్నాడు.

ఎందుకంటే భోళా శంకర్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. దాని తర్వాత ఏం సినిమా చేయాలో ఇప్పటివరకు డిసైడ్ చేసుకోలేదు చిరంజీవి. ఇలాంటి సమయంలో సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ కథల వైపు మెగాస్టార్ అస్సలు వెళ్లడం లేదు. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కావాలి అంటున్నాడు. తన ఇమేజ్ కు తగ్గట్టు కామెడీ కాస్త యాక్షన్ మాస్ మసాలా ఉంటే చాలు అనుకుంటున్నాడు. రొటీన్ కథ అయినా పర్లేదు తన ఇమేజ్ తో నడుస్తుందని వాల్తేరు వీరయ్య నిరూపించడంతో అలాంటి కథల వైపు అడుగులు వేస్తున్నాడు మెగాస్టార్.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ కూడా 30 రోజుల్లో సినిమా తీయడం ఎలా అనే పరీక్ష పెట్టాడు. ఒకవేళ ఇందులో నెగ్గితే పూరీ, చిరంజీవి కాంబినేషన్ ఇదే ఏడాది పట్టాలెక్కడం ఖాయం. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ నాటికి సినిమా కూడా విడుదలవుతుంది. మరి ఈ కండిషన్స్ అప్లై ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bao missing | మొన్న జాక్‌మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్‌.. చైనాలో ఏం జరుగుతోంది?

Twitter | ఎలన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్‌

Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ

Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్‌లో ఫ్యాన్స్

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News