Nandamuri Balakrishna | సీనియర్ హీరోల్లో పారితోషకం పరంగా అందనంత ఎత్తులో ఉన్న హీరో చిరంజీవి. ఆయన సినిమాకు దాదాపు 40 నుంచి 60 కోట్ల మధ్యలో తీసుకుంటున్నాడు. ఆయన తర్వాత ఉన్న బాలకృష్ణ ఇప్పటికీ 20 కోట్లు అందుకోలేదు. చిన్న నిర్మాతలకు కూడా అందుబాటులో ఉండేలా బాలయ్య తన పారితోషకం తీసుకుంటున్నాడు. మొన్నటికి మొన్న వీరసింహారెడ్డి సినిమాకు కూడా 15 కోట్లకు మించి ఏదైనా పారితోషకం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త.
దానికి ముందు అఖండ సినిమాకు కూడా కేవలం 12 కోట్లు మాత్రమే తీసుకున్నాడు బాలకృష్ణ. తన మార్కెట్ రేంజ్ తెలిసి బడ్జెట్ ఎంత ఉందో లెక్కలు వేసుకొని రెమ్యూనరేషన్ అందుకుంటాడు ఈయన. కొన్నిసార్లు సినిమా కానీ పోయిందంటే పారితోషికం వెనక్కి ఇవ్వడానికి కూడా బాలయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అయితే గత మూడేళ్లుగా బాలకృష్ణ మార్కెట్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. అంతకుముందు 40 కోట్ల అందుకోవడానికి నానా ఇబ్బంది పడే బాలయ్య సినిమాలు.. ఇప్పుడు మొదటిరోజే 30 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి.
అఖండ సినిమా 75 కోట్ల షేర్ వసూలు చేస్తే.. మొన్న విడుదలైన వీరసింహారెడ్డి యావరేజ్ టాక్ తో కూడా 79 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో బాలయ్య కూడా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు ప్రచారం జరుగుతుంది. సినిమాకు 20 కోట్ల వరకు ఇకమీద చార్జ్ చేయాలని బాలయ్య అనుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాకు 17 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు బాలకృష్ణ.
ఆయన ఎంత అడిగినా కూడా నిర్మాతలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ కనీసం 50 కోట్ల కంటే పైన జరుగుతుంది. మరోవైపు డిజిటల్ శాటిలైట్ అన్ని కలిపి మరో 50 కోట్ల వరకు వస్తున్నాయి. ఎలా చూసుకున్నా కూడా బాలకృష్ణ సినిమా 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తుంది.అందులో ఐదు వంతు ఆయనకు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఎందుకు సందేహిస్తారు చెప్పండి.
40 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలే 20 కోట్ల పారితోషకం అందుకుంటున్నప్పుడు.. 70 కోట్లకు పైగా వసూలు చేస్తున్న బాలకృష్ణ 20 కోట్లు అందుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆయన అడిగినా అడక్కపోయినా 20 కోట్లు కాదు.. అంతకుమించి ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీగా ఉన్నారు.
అనిల్ రావిపూడి సినిమా పూర్తి కాగానే పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, క్రిష్ లలో కచ్చితంగా ఒకరితో సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. దానికి కూడా భారీ పారితోషకం అందుకోవడం ఖాయం. ఏదేమైనా ఈయన కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. అందుకే రెమ్యూనరేషన్ పెంచేసాడు బాలకృష్ణ.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Bao missing | మొన్న జాక్మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్.. చైనాలో ఏం జరుగుతోంది?
Twitter | ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. భారత్లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్
Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ
Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్లో ఫ్యాన్స్
Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!
Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?
Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!