Keerthy Suresh | నేషనల్ అవార్డు విన్నింగ్ నటి, తెరమీద అద్భుతాలు చేసే యాక్ట్రెస్, ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయే అద్భుతమైన పర్ఫార్మర్, ఇలా కీర్తి సురేష్ కు చాలా పేర్లు ఉన్నాయి. కాకపోతే అవకాశాలు మాత్రం లేవు. ఇంత పేరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖాళీ లేనంత బిజీగా ఉండాలి ఏ హీరోయిన్ అయినా..! కానీ కీర్తి సురేష్ మాత్రం కేవలం పేరు మాత్రమే సంపాదించింది అవకాశాలు కాదు. ఈమె విషయంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంది పరిస్థితి.
పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించిన తర్వాత కూడా మిగిలిన హీరోలు ఈమె వైపు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు నిర్మాతలు కూడా కీర్తి సురేష్ పేరు వింటే భయపడుతున్నారు. దానికి కారణం ఆమె రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది.
గతేడాది సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుతో నటించిన తర్వాత ఈమెకు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా రాలేదు. పైగా ఆ సినిమాలో కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా అందాలు ఆరబోసింది. గ్లామర్ డోర్స్ కూడా ఓపెన్ చేసింది. ఈమె దూకుడు చూసిన తర్వాత మహేష్ సినిమా విడుదలైన వెంటనే వరుసగా ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అదేం జరగడం లేదు ఇప్పుడు.
విడుదలకు సిద్ధమైన నాని దసరా సినిమాకు ఎప్పుడో రెండు సంవత్సరాల కింద ఓకే చెప్పింది కీర్తి సురేష్. దాంతోపాటు చిరంజీవి భోళా శంకర్ కూడా పాత సినిమానే. ఈమధ్య ఈమె కొత్తగా సైన్ చేసిన సినిమా ఒక్కటి కూడా లేదు. దానికి కారణం ఆమె రెమ్యూనరేషన్ అని తెలుస్తోంది. దానికి తోడు స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తాననే కండిషన్ పెట్టుకోవడంతో.. ఈమె వైపు నిర్మాతలు చూడడానికి కూడా భయపడుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే సినిమాకు దాదాపు కోటిన్నర వరకు తీసుకుంటున్న కీర్తి సురేష్.. మరో కోటి పెంచి రెండున్నర కోట్లు కావాలి అంటూ డిమాండ్ చేస్తుందని.. పారితోషికం తక్కువైతే సినిమాలు కూడా వదులుకుంటుంది కానీ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుందని తెలుస్తోంది.
ఇదే ఆటిట్యూడ్ కంటిన్యూ అయితే కొత్త ముద్దుగుమ్మల దాటి తట్టుకోవడం కీర్తి సురేష్ కు తలకు మించిన భారమే అవుతుంది. పైగా ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ల మీద కూడా ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకే స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చిన రాకపోయినా అంటీ ముట్టనట్టు ఉంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Bao missing | మొన్న జాక్మా.. నేడు దిగ్గజ బ్యాంకర్ మిస్సింగ్.. చైనాలో ఏం జరుగుతోంది?
Twitter | ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం.. భారత్లోని రెండు ఆఫీసులను మూసేసిన ట్విట్టర్
Chetan Sharma | మంట రేపిన మాటలు.. చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామ చేసిన చేతన్ శర్మ
Actor Nandu | సింగర్ గీతా మాధురి భర్త నందూకి యాక్సిడెంట్.. షాక్లో ఫ్యాన్స్
Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!
Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?
Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!