Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentActor Prabhu | ప్రముఖ సినీ నటుడు ప్రభుకు అస్వస్థత.. ఎమర్జెన్సీగా సర్జరీ పూర్తి చేసిన...

Actor Prabhu | ప్రముఖ సినీ నటుడు ప్రభుకు అస్వస్థత.. ఎమర్జెన్సీగా సర్జరీ పూర్తి చేసిన వైద్యులు

Actor Prabhu | ప్రముఖ సినీ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రభు పరిస్థితి మంగళవారం రాత్రి విషమించింది. దీంతో చెన్నైలోని కేలంబాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి అతని కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ ప్రభును పరీక్షించిన వైద్యులు వెంటనే ఆపరేషన్ చేశారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభు పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఆయన్ను డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. ప్రభు అస్వస్థత గురించి తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతారు. ప్రభు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చి తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభు గణేశన్. ఘర్షణ (1988), చంద్రముఖి, కథానాయకుడు, వీడొక్కడే వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. ప్రభాస్ డార్లింగ్ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగులో సినిమాలు చేయడమూ మొదలుపెట్టాడు. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్, వారసుడు చిత్రాల్లో ప్రభు కనిపించాడు. అన్నట్టు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు కూడా తమిళ నాట హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News