Tuesday, April 16, 2024
- Advertisment -
HomeEntertainmentTaraka Ratna | తారకరత్న జయంతి.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు దేవుడా..!

Taraka Ratna | తారకరత్న జయంతి.. ఇంత కష్టం ఎవరికీ రాకూడదు దేవుడా..!

Taraka Ratna | నిజంగానే ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఎందుకంటే పుట్టినరోజు మరో నాలుగు రోజుల దూరంలో ఉండగానే.. ఎవరికి అందనంత దూరంగా ఆ మనిషి వెళ్ళిపోవడం అనేది కుటుంబానికి జీర్ణించుకోలేని విషయం. ఇప్పుడు తారకరత్న విషయంలో ఇదే జరుగుతుంది. సాధారణంగా అయితే ఫిబ్రవరి 22 ఒక మామూలు తేదీగా మిగిలిపోయేది. కానీ ఇప్పుడు అది తారకరత్న జయంతిగా మారిపోయింది.

జనవరి 27న లోకేష్ పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతరం 23 రోజులు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి చివరికి ఫిబ్రవరి 18న కన్నుమూశాడు తారకరత్న.
ఆయన చనిపోయాడనే విషయాన్ని ఇంకా అభిమానులు నమ్మలేకపోతున్నారు.. కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతలోనే ఆయన పుట్టినరోజు రావడంతో అతడి జ్ఞాపకాలని తలుచుకొని నందమూరి కుటుంబం కుమిలిపోతుంది.

1983 ఫిబ్రవరి 22న నందమూరి తారక రామారావు కుమారుడు మోహనకృష్ణకు జన్మించాడు తారకరత్న. ఆయనకు అతనొక్కడే కొడుకు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా అందరి మధ్య పెరిగాడు తారకరత్న. అతనంటే కుటుంబంలో ఎంత ప్రేమ లేకపోతే ఒకేసారి 9 సినిమాలతో లాంచ్ చేయాలనుకుంటారు..? ప్రపంచ సినీ చరిత్రలో కేవలం తారకరత్నకు మాత్రమే సాధ్యమైన రికార్డు అది.

కాకపోతే నటుడిగా ఆయన తనదైన ముద్ర వేసుకోలేకపోయాడు. 23 సినిమాలు చూసినా మార్కెట్ సంపాదించుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వెళ్లి తనదైన ముద్ర వేయాలి అని బలంగా నిర్ణయించుకుని.. అటువైపు అడుగులు వేస్తున్న సమయంలోనే దేవుడు చిన్న చూపు చూశాడు. కేవలం 39 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు రావడంతో కలలన్నీ కళ్ళ ముందే కళ్ళలుగా మిగిలిపోయాయి. తారకరత్న జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి అభిమానులు ఆయనకు కన్నీటి నివాళి అందించబోతున్నారు. దాంతో పాటు పేద ప్రజలకు తోచిన సాయం చేయాలని నిర్ణయించుకున్నారు నందమూరి ఫ్యాన్స్.

ఏదేమైనా నందమూరి కుటుంబంలో ఇలాంటి వరుస విషాదాలు అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. ఐదేళ్ల కింద హరికృష్ణ కూడా తన పుట్టినరోజుకు మూడు రోజుల ముందు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయాడు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు అయితే 2018, ఆగస్టు 29న రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు హరికృష్ణ. ఇప్పుడు తారకరత్న కూడా తన పుట్టినరోజుకు కేవలం నాలుగు రోజుల ముందు గుండెపోటుతో మరణించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!

Dadasaheb Phalke Awards 2023 | దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డులు ఎవరెవరికి వచ్చాయి.. లిస్టులో కాంతారా, ఆర్ఆర్ఆర్!

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News