Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentRajinikanth | వామ్మో రజినీకాంత్‌కి వారం రోజులకే అన్ని కోట్ల రెమ్యునరేషనా?

Rajinikanth | వామ్మో రజినీకాంత్‌కి వారం రోజులకే అన్ని కోట్ల రెమ్యునరేషనా?

Rajinikanth | సూపర్‌స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి సెలబ్రెటీ ఆయన అభిమానే. అంతలా తన నటన, అభినయంతో ప్రేక్షకులలో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రజనీకి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఇమేజ్ ఆయనది. ఈయన సినిమాకు కోలీవుడ్‌లో ఎలాంటి సెలబ్రెషన్స్‌ జరుగుతాయో.. టాలీవుడ్‌లో కూడా అదే రేంజ్‌లో సెలబ్రెషన్స్‌ జరుగుతాయి. టాక్ తో సంబంధం లేకుండా తెరపై రజనీ కనిపిస్తే చాలు నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. కానీ కొంత కాలంగా రజనీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయాలు సాధించడంలేదు. ప్రస్తుతం రజనీ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు.

ప్రస్తుతం రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా పూర్తవ్వగానే తలైవా.. తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్న లాల్ సలాం సెట్లో అడుగుపెట్టనున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో రజనీ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం తలైవా వారం రోజులు కాల్షీట్లను ఇచ్చాడట. అంతేకాకుండా ఈ వారం రోజులకు గానూ రజనీ దాదాపు రూ.25 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు తమిళ వర్గాల సమాచారం.

తలైవాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా లైకా ఇంత పెద్ద మొత్తం ఇవ్వడానికి డీల్ కుదిరించుకుందట. అంతేకాకుండా ఈ సినిమాలో రజనీ రోల్ కూడా అదే రేంజ్ లో ఉంటుందట. ఇక రజనీ జైలర్ సినిమా కోసం కూడా భారీ మొత్తంలో దాదాపు రూ.140 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు గానీ ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటే మాత్రం ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా రజనీ పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News