Home Entertainment Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Prabhas – Kriti Sanon | ప్రభాస్‌, కృతిసనన్‌ ప్రేమ వ్యవహారం ఇప్పుడు బీటౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆదిపురుష్‌ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. తొలుత ఆదిపురుష్‌ టీజర్‌ రిలీజ్‌ చేసిన సందర్భంలో వీళ్లపై పుకార్లు వచ్చాయి. ఈ వార్తలను ప్రభాస్‌, కృతి సనన్‌ ఇద్దరూ కొట్టిపారేశారు. దీంతో కొంతకాలం ఆగినట్టే ఆగి మళ్లీ వార్తలు మొదలయ్యాయి.

రీసెంట్‌గా బాలీవుడ్ లవ్‌ బర్డ్స్‌ సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ ప్రేమ పెళ్లి చేసుకోవడంతో.. త్వరలోనే ప్రభాస్‌, కృతిసనన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధూ చేసిన ట్వీట్‌ కారణంగానే ఈ వదంతులు పుట్టుకొచ్చాయి. ప్రభాస్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఉమైర్‌ సంధూ రీసెంట్‌గా ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతిసనన్‌తో ప్రభాస్‌ ఎంగేజ్‌మెంట్‌ వచ్చే వారం మాల్దీవుల్లో జరగనుంది. అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఇది కాస్త వైరల్‌ కావడంతో బాలీవుడ్‌ మీడియాలో పలు కథనాలు మొదలయ్యాయి.

కృతిసనన్‌తో ఎంగేజ్‌మెంట్‌ హాట్‌ టాపిక్‌గా మారడంతో ప్రభాస్‌ టీమ్‌ స్పందించింది. ఆ కథనాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇది కేవలం కొందరి ఊహ మాత్రమేనని తెలిపింది. ప్రభాస్‌, కృతి సనన్‌ ఇద్దరూ సహ నటులు, మంచి స్నేహితులు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ టీమ్‌ ఇచ్చిన క్లారిటీతో అయినా వీళ్ల పెళ్లి రూమర్స్‌ ఆగుతాయో లేదో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Kirak RP | కిరాక్‌ ఆర్పీ నెల్లూరు చేపల పులుసు వాళ్ల భిక్షే.. జబర్దస్త్‌ కమెడియన్‌ రాకింగ్ రాకేశ్‌ సెన్సేషల్‌ కామెంట్స్‌

Kutty Padmini | రూంలో అడ్జస్ట్‌ అవ్వమని దర్శకులు అడిగారు.. స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగే అదృష్టం లేకపోయింది.. బయటపెట్టిన సీనియర్‌ నటి

Sidharth malhotra & Kiara Advani | గ్రాండ్‌గా కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. హనీమూన్ మాత్రం లేదంట..

Tamannah Bhatia | బాలీవుడ్‌ నటుడితో పెళ్లి పుకార్లు.. దైవ చింతనపై ధ్యాస పెట్టిన తమన్నా.. మొన్న ఏమో హిమాలయాలకు..

Jabardasth Punch Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ పంచ్ ప్రసాద్‌కు ఎవరు ఎక్కువగా సాయం అందిస్తున్నారు?

Prabhas | ప్రభాస్‌కు అస్వస్థత.. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్

Exit mobile version