Tuesday, July 23, 2024
- Advertisment -
HomeEntertainmentPavitra Naresh | నరేశ్, పవిత్ర లోకేశ్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? పబ్లిసిటీ కోసం చేస్తున్న...

Pavitra Naresh | నరేశ్, పవిత్ర లోకేశ్ నిజంగానే పెళ్లి చేసుకున్నారా? పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంటా?

Pavitra Naresh | ఎట్టకేలకు నరేశ్, పవిత్ర ఒక్కటయ్యారు. తెలుగు సినీ పరిశ్రమలో కాంట్రవర్సీ జంటగా పేరొందిన వీళ్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తన స్నేహితురాలు పవిత్రను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించబోతున్నానని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన నరేశ్.. తాజాగా హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని పవిత్ర, నరేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కొత్త ప్రయాణం సాఫీగా సుఖశాంతులతో సాగేలా మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు. పవిత్రను పెళ్లి చేసుకున్న వీడియోను కూడా ఈ ట్వీట్‌లో జోడించారు. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంటూ రాసుకొచ్చారు.

నరేశ్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి చాలామంది శుభాకాంక్షలు చెబుతుంటే కొంతమంది మాత్రం సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారా? లేదంటే ఏదైనా సినిమా ప్రచారమా? అనే వాదన వినిపిస్తుంది. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో పవిత్ర, నరేశ్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతోందని.. దాని ప్రచారంలో భాగంగానే అందులోని సీన్స్‌ను ఇలా పోస్టు చేసి ఉంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే.. సూపర్ స్టార్ కృష్ణ మరణించి కనీసం 6 నెలలు కూడా అవ్వట్లేదు. అప్పుడే పెళ్లి ఎలా చేసుకుంటాడని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆ వీడియోలో నరేశ్, పవిత్ర తప్ప వాళ్ల కుటుంబీకులు, సన్నిహితులు ఎవ్వరూ లేరు. అందరూ యూత్ మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా జూనియర్ ఆర్టిస్టుల్లానే కనిపిస్తున్నారు. దీంతో కచ్చితంగా ఇది మూవీ షూటింగే అని పలువురు నెటిజన్లు వాదిస్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా గతంలో పోస్టు చేసిన వీడియో కూడా ఇందులో భాగమేనని అంటున్నారు.

కొంతకాలంగా పవిత్ర లోకేశ్, నరేశ్ జంట ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. తన మూడో భార్య రమ్య రఘుపతితో విబేధాల కారణంగా దూరంగా ఉంటున్న నరేశ్.. పవిత్ర లోకేశ్‌కు దగ్గరయ్యాడు. సినిమాల పరంగా స్టార్ట్ అయిన తమ స్నేహం తక్కువ టైమ్‌లోనే ప్రేమగా మారింది. అప్పట్నుంచి పవిత్రకు సినిమా ఛాన్స్‌లు ఇప్పించేవాడు. ఇద్దరూ కలిసి సీక్రెట్‌గా బయటకు వెళ్లేవాళ్లు. అలా ఒకసారి రహస్యంగా కలుసుకున్న సమయంలోనే నరేశ్ భార్య రమ్య రఘుపతి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి గురించే టాపిక్ వచ్చేది. ఈ వార్తలు ఎక్కువ కావడంతో తమ బంధాన్ని బయటపెట్టాడు నరేశ్. త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుని కొత్త జర్నీ ప్రారంభించబోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఒక వీడియోను కూడా నరేశ్ షేర్ చేశాడు. లిప్ కిస్ ఇవ్వడంతో పాటు ఒకరినొకరు కేక్ తినిపించుకునే దృశ్యాలు ఉన్న ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.

పెళ్లి ప్రకటన తర్వాత తన మూడో భార్య రమ్య రఘుపతికి విడాకుల నోటీసులు కూడా నరేశ్ పంపించాడు. విడాకులు ఇచ్చేందుకు మాత్రం రమ్య రఘుపతి నిరాకరించింది. తనకు ఆస్తి కంటే.. తన కుమారుడికి తండ్రి ముఖ్యమని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయం ఎటూ తేలకముందే పవిత్రను నరేశ్ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రమ్య రఘుపతితో సైలెంట్‌గా సెటిల్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడా? లేదా మూవీ ప్రమోషనా అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News