Friday, March 31, 2023
- Advertisment -
HomeEntertainmentTollywood | సమంత, రేణూ దేశాయ్.. అరుదైన వ్యాధుల బారిన పడిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే

Tollywood | సమంత, రేణూ దేశాయ్.. అరుదైన వ్యాధుల బారిన పడిన టాలీవుడ్ సెలబ్రెటీలు వీళ్లే

Tollywood | ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌ను కదిపినా ఏదో ఒక వ్యాధి ఉన్నట్లు తెలుపుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యాధుల బారిన పడుతున్న హీరోయిన్ల సంఖ్య మరీ ఎక్కువైపోయింది. ఏ ముద్దుగుమ్మను చూసినా ఏదో ఒక వ్యాధితో బాధపడుతుంది. గతేడాది మయోసైటిస్ అంటూ అరుదైన వ్యాధి గురించి చెప్పి సామ్ అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇటీవలే మమతా మోహన్ దాస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధ పడుతున్నట్లు తెలిపింది. తాజాగా పవన్‌కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇలా ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు రకరకాల వ్యాధులతో భాధపడుతున్నారు. అలా ఈ మధ్య కాలంలో పలు రకాల వ్యాధుల బారిన పడిన హీరోయిన్లు ఎవరెవరో ఓ లుక్కేద్దాం.

సమంత

నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఇక గతేడాది మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సామ్.. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటుంది. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్‌ అని నిరూపించుకుంటుంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చిన సమంత ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం కెమెరా ముందుకు వచ్చింది. తాజాగా సమంత తమిళనాడులోని దిండిక్కల్‌ జిల్లాలోని పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. వ్యాధి నుంచి కోలుకున్న సందర్భంగా కొండ కింది నుంచి పై వరకు మెట్టు మెట్టుకు హారతి వెలిగించుకుంటూ మొక్కు చెల్లించుకుంది.

మమతా మోహన్ దాస్

యమదొంగ, చింతకాయల రవి, కింగ్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం విటిలిగో అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవలే తెలిపింది. ఆ వ్యాధి తన చర్మ రంగును కోల్పోయేలా చేస్తోందని, క్రానిక్ ఆటో ఇమ్యూన్ దిజార్దర్ వల్ల ఈ వ్యాధి ఏర్పడినట్లు ఇన్ స్టాలో వెల్లడించింది. మమతా గతంలో రెండు సార్లు కరోనా బారినపడి కోలుకుంది.

రేణూ దేశాయ్

‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణూ దేశాయ్‌.. ఆ తర్వాత పవన్‌ను పెళ్లాడి తెలుగువారికి మరింత దగ్గరైంది. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయి దూరంగా ఉంటున్నారు. కాగా ఇటీవలే ఈ అమ్మడు గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

కల్పిక గణేష్

ప్రయాణం సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించిన కల్పిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా దూసుకుపోతుంది. గతేడాది రిలీజైన యశోదలోనూ కల్పిక కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే తను సమంతలానే పదమూడేళ్లుగా మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఇక నవంబర్ చివరి వారంలో కల్పిక ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసి అందరిని షాక్ కు గురిచేసింది. అప్పుడు లుంబార్ రాడిక్యులోపతి సర్జరీ చేయించుకుని ఆ వ్యాధి బారి నుండి బయటపడింది. ఈ వ్యాధి వల్ల మనిషి ఎక్కువసేపు నిల్చోలేకపోవడంతో పాటు బలహీనంగా మారుతాడు.

హంసానందిని

హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన హంసానందిని ఐటెం సాంగ్స్ తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. పలు స్టార్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో మెప్పించింది. కాగా హంసానందిని బ్రెస్ట్ కాన్సర్ బారిన పడి కోలుకుంది. ఈ మహమ్మారి కారణంగా నటనకు రెండేళ్లు దూరమైంది. మళ్లీ ఇప్పుడు నటనపై దృష్టిపెట్టింది.

స్నేహా ఉల్లాల్

ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ బారినపడినట్లు గతంలో వెల్లడించింది. ఈ వ్యాధి వల్ల అరగంట కన్నా ఎక్కువ సేపు నిలబడలేనని అప్పట్లో ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

పూనమ్ కౌర్

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన పూనమ్ కౌర్ శ్రీకాంత్ హీరోగా నటించిన మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించింది. కాగా ఈ అమ్మడు గత డిసెంబర్ లో ఫైబ్రోమయాల్జియా అనే కండర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు, ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది.

వీరితో పాటుగా హిందీ తారామణులు యామీ గౌతమ్ చర్మ సంబంధిత సమస్య, సోనమ్ కపూర్ జువైనల్ డయాబెటిస్, ఫాతిమా సనా షేక్ మూర్చవ్యాధి ఇలా పలువురు తమ తమ వ్యాధుల గురించి అభిమానులతో స్వయంగా పంచుకున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!

Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?

Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!

Megastar Chiranjeevi | చిరంజీవి గందరగోళం.. ఇలాగైతే ఎలా మెగాస్టార్ గారూ..?

Tamanna | తమన్నా లవ్ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్ అయిందిగా.. పెళ్లే తరువాయి..?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News