Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsIPL2023 | ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఎవరితో ఎవరంటే ?

IPL2023 | ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ విడుదల.. తొలి మ్యాచ్‌ ఎవరితో ఎవరంటే ?

IPL2023 | టైమ్‌ 2 న్యూస్‌, ముంబై: దేశంలో అతిపెద్ద క్రికెట్‌ జాతరకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది వేసవిలో వినోదాల విందు పంచే ఐపీఎల్‌కు నగారా మోగింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2023 షెడ్యూల్‌ విడుదలైంది. ఇప్పటి వరకు 15 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్‌.. ఈ ఏడాది సరికొత్తగా మన ముందుకు రానుంది. ఐపీఎల్‌-16వ సీజన్‌ మార్చి 31న ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అహ్మదాబాద్‌లో జరుగనున్న తొలి పోరులో చైన్నై సూపర్‌ కింగ్స్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనుంది. శుక్రవారం లీగ్‌ ప్రారంభం కానుండగా.. ఆ వెంటనే వరుసగా రెండు రోజుల పాటు డబుల్‌ హెడర్స్‌ ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. మొత్తం 12 వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. పది టీమ్‌ల సొంత వేదికలతో పాటు గువాహటి (రాజస్థాన్‌ రాయల్స్‌ రెండో హోం గ్రౌండ్‌), ధర్మశాల (పంజాబ్‌ కింగ్స్‌ రెండో వేదిక)లోనూ మ్యాచ్‌లు జరుగనున్నాయి. 52 రోజుల పాటు జరుగనున్న సీజన్‌లో లీగ్‌ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. సీజన్‌ మొత్తంలో 18 డబుల్‌ హెడర్స్‌ జరుగనుండగా.. మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానున్నాయి. డబుల్‌ హెడర్‌ ఉన్న రోజు తొలి మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. మే 28న ఐపీఎల్‌ ఫైనల్‌ నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

ఈసారి పాత పద్దతిలోనే..

కరోనా విజృంభణ కారణంగా గత కొన్నాళ్లుగా ఈ లీగ్‌ను పరిమిత వేదికల్లోనే నిర్వహిస్తుండగా.. ఈసారి అందుకు భిన్నంగా పాత పద్దతిలో ఇంటా, బయటా విధానంలో జరుపనున్నారు. ప్రతి జట్టు సొంతగడ్డపై సగం మ్యాచ్‌లు.. మిగిలిన ఏడు మ్యాచ్‌లు వేర్వేరు వేదికలపై ఆడనుంది. దీంతో గత కొన్నాళ్లుగా క్రికెట్‌ పండుగను ఆస్వాదించలేకపోయిన హైదరాబాద్‌ అభిమానులు ఈ సారి సంబురాలు చేసుకోనున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడనున్న ఏడు మ్యాచ్‌లకు ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. హైదరాబాద్‌లో ఏప్రిల్‌-2 (ఆదివారం)న తొలి మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. అయితే మొన్నటి వరకు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్‌ విలియమ్సన్‌ను వదిలేసుకున్న సన్‌రైజర్స్‌ ఈ సారి దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మార్క్‌రమ్‌కు పగ్గాలు కట్టబెట్టాలని చూస్తోంది.

హైదరాబాద్‌లో జరుగనున్న మ్యాచ్‌ల వివరాలు..

  1. ఏప్రిల్‌-2 రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..
  2. ఏప్రిల్‌-9 పంజాబ్‌ కింగ్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..
  3. ఏప్రిల్‌-18 ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..
  4. ఏప్రిల్‌-24 ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..
  5. మే-4 కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..
  6. మే-13 లక్నో సూపర్‌ జెయింట్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ. 3.30 నుంచి..
  7. మే-18 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో హైదరాబాద్‌ రాత్రి 7.30 నుంచి..

హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనున్న ఏడు మ్యాచ్‌ల వివరాలు ఇవే.. మరింకెందుకు ఆలస్యం దీనికి తగ్గట్లు మీ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకొని వికెట్ల వేట ప్రారంభించండి!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News