Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentVaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Vaarasudu release date | సంక్రాంతి సినిమాల రిలీజ్ మీద కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర పోరుకు సిద్ధమవుతుంటే.. దిల్ రాజు తమిళ డబ్బింగ్ సినిమాతో ముందుకొచ్చాడు. వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి సినిమాల కంటే ముందుగానే తన వారసుడు సినిమాను రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని సగానికి పైగా థియేటర్లను దగ్గర పెట్టుకున్నాడు. దీనిపై టాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. ఇద్దరు స్టార్ హీరోలు సంక్రాంతికి వస్తుంటే.. డబ్బింగ్ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించడమేంటని నిలదీశారు. అయినా దిల్ రాజు సైలెంట్‌గా ఉండటంతో రోజురోజుకీ ఈ వివాదం ముదిరింది. ఇలాంటి టైమ్‌లో దిల్ రాజు వెనక్కి తగ్గాడు. సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు సంచలన ప్రకటన చేశాడు. తన వారసుడు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నానని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పాడు.

వారసుడు సినిమాను జనవరి 11న విడుదల చేస్తున్నామని దిల్ రాజు ముందుగానే ప్రకటించాడు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుండటంతో తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ తెలుగులో మాత్రం ఎలాంటి హడావుడి లేదు. దీంతో సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాడా? టాలీవుడ్ నిర్మాతల నుంచి ఒత్తిడి కారణంగా దిల్ రాజు తన సినిమాను ఆపేస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి . ఈక్రమంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని జవనరి 14న రిలీజ్ చేస్తానని వెల్లడించాడు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఈ రెండు సినిమాలకు తన సినిమా పోటీ కాదని.. తనది కుటుంబ కథా చిత్రమని తెలిపాడు. తమ బ్యానర్ నుంచి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని తెలిపాడు. ఇప్పుడు వారసుడు కూడా అలాగే అలరించనుందని పేర్కొన్నాడు.

అందరు నిర్మాతలు బాగుండాలనే ఉద్దేశ్యంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గానని దిల్ రాజు తెలిపాడు. అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాతనే వారసుడు సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. అయితే తెలుగు వర్షన్ రిలీజ్ మాత్రమే వాయిదా పడింది. తమిళంలో వారిసు రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పులేదు. తమిళనాట ఈ చిత్రం అనుకున్న సమయానికే రిలీజ్ కానుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ

Rashmika Mandanna | ట్రోల్స్‌పై స్పందించిన రష్మిక.. కాంతార డైరెక్టర్‌కు స్ట్రాంగ్ కౌంటర్

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News