Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentSreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Sreemukhi | సెలబ్రెటీల పెళ్లిళ్లపై రూమర్స్ రావడం ఇప్పుడు ఎక్కువైపోయింది. కీర్తి సురేశ్, సాయిపల్లవి, తమన్నా, త్రిష.. ఇలా చాలామంది హీరోయిన్ల పెళ్లిళ్లపై గాసిప్స్ వచ్చాయి. రీసెంట్‌గా బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి పెళ్లిపై కూడా పుకార్లు చాలానే వచ్చాయి. స్టార్ యాంకర్ శ్రీముఖికి మ్యారేజ్ ఫిక్సయిందని.. యంగ్ బిజినెస్‌మ్యాన్‌తో త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుందని ప్రచారం జరిగింది. రెండు మూడు రోజులుగా ఈ న్యూస్ వైరల్ కావడంతో శ్రీముఖి ఘాటుగా స్పందించింది.

ఒకసారి బాయ్‌ఫ్రెండ్ ఎవరు అని అడుగుతారు.. ఇంకోసారి పెళ్లి ఎప్పుడు అంటారు.. ఇప్పుడేమో మా నాన్న ఫొటోను బ్లర్ చేసి ఏకంగా పెళ్లి ఫిక్సయిందని రూమర్స్ పుట్టిస్తున్నారు అని శ్రీముఖి అసహం వ్యక్తం చేసింది. మరీ ఇంత ఘోరమా అంటూ మండిపడింది. ఇలాంటి వార్తలను విని విని విసుగొచ్చే్స్తోందని పేర్కొంది. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో హ్యాపీగా ఉన్నా.. ఇంకా మూడు నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొంది. అప్పుడు కూడా పెళ్లి విషయం తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన ఏది లేదని పేర్కొంది. దయచేసి ఇలాంటి వదంతులను పుట్టించొద్దని వేడుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News