Home Entertainment Unstoppable | ప్రభాస్, గోపీచంద్ గొడవపడ్డది ఆ హీరోయిన్ కోసమేనట

Unstoppable | ప్రభాస్, గోపీచంద్ గొడవపడ్డది ఆ హీరోయిన్ కోసమేనట

Pic Credits : Aha Youtube promo

Unstoppable | ఇండస్ట్రీలో ప్రభాస్ ( Prabhas ), గోపీచంద్ ( Gopichand ) మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. వర్షం సినిమాతో మొదలైన వీళ్ల ఫ్రెండ్‌షిప్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య ఎంత స్నేహం ఉన్నా వీళ్లిద్దరూ కలిసి మీడియాకు కనిపించిన సందర్భాలు చాలా తక్కువే. కానీ ఈ సారి ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో ఇద్దరూ కలిసి కనిపించారు. బాలయ్యతో కలసి అల్లరి అల్లరి చేశారు. ఈ సందర్బంగా వాళ్ల సీక్రెట్స్ తెలుసుకునేందుకు బాలయ్య తెగ ప్రయత్నించాడు. నవ్విస్తూనే వాళ్లు గుట్టు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు. బాలయ్య అడిగిన దానికి ప్రభాస్, గోపీచంద్ కూడా తెలివిగా సమాధానాలు ఇస్తూ తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్, గోపీచంద్ ఏ హీరోయిన్ కోసం గొడవపడ్డారో చెప్పాలని బాలయ్య అడిగాడు.

ఆహాలో ఇప్పటివరకు ఏ గెస్ట్ వచ్చినా సరే ఒకటే ఎపిసోడ్‌లో కంప్లీట్ చేశారు. ఫర్ ది ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఎపిసోడ్ మాత్రం రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌లో ప్రభాస్ ఒక్కడే ఎంటరయ్యాడు. మధ్యలో రామ్‌చరణ్‌తో కాల్ మాట్లాడాడు. రెండో ఎపిసోడ్‌లో మాత్రం ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌ను రంగంలోకి దింపాడు బాలయ్య. వాళ్లిద్దరి అనుబంధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 2008లో ఓ హీరోయిన్ కోసం మీరేదో గొడవపడ్డారట అని అడిగాడు బాలయ్య. దానికి నేనైతే పడలేదు.. నువ్వు చెప్పురా అంటూ గోపీచంద్‌కు ప్రభాస్ హింట్ ఇచ్చాడు. గోపీచంద్ కూడా ఆలోచించి సమాధానమిచ్చాడు. 2008లో కాదు సార్.. 2004లో.. త్రిష కోసం వర్షంలో గొడవపడ్డాం అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ కూడా మా వాడు సూపర్‌గా ఆన్సర్ ఇచ్చాడు అని నవ్వుతూ అన్నాడు. ఈ సమాధానం విన్న బాలయ్య.. ఈ ఒంగోలియన్ ట్విస్టులు వద్దు అని సెటైర్ వేశాడు. ఇలా ముగ్గురి మధ్య జరిగిన ఈ ఫన్నీ ఎపిసోడ్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక గోపీచంద్ నటించిన జిల్ సినిమాను తను మూడు సార్లు చూశానని. అందులో హీరో ట్రెండీ మేకోవర్ చాలా బాగా నచ్చిందని బాలయ్య చెప్పుకొచ్చాడు. అయితే తన ట్రెండీ లుక్ వెనుక ప్రభాస్ ఉన్నాడని గోపీచంద్ ఈ సందర్భంగా బయటపెట్టాడు. రొటీన్ లుక్స్‌తో తనను చూసి గెటప్ మార్చుకోమని సలహా ఇచ్చాడట డార్లింగ్. అందుకే జిల్ సినిమాలో ఫ్యాన్సీగా, స్టైలిష్‌గా కనిపించానని చెప్పాడు. ఈ సమాధానం విన్న బాలయ్య.. అలాగే మెయింటైన్ చేయమని సలహా ఇచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

Hit 2 Ott Release | అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ ‌కు షాక్.. ఓటీటీలో నుంచి హిట్ 2 తొలగింపు

Mrunal Thakur | సీతారామం తర్వాత రెమ్యునరేషన్ రెండింతలు పెంచేసిన మృణాల్ ఠాకూర్.. నాని సినిమాకు అంత డిమాండ్ చేసిందా?

NTRforOscars | ఈ క్రేజ్ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆస్కార్ రావడం పక్కా అన్నట్టే

Sharwanand | తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ లవ్ మ్యారేజి.. వధువు ఏం చేస్తుందంటే..

Exit mobile version