Vijay Antony | మలేసియాలో పిచ్చైకారన్ 2 ( బిచ్చగాడు 2) చిత్ర షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడిన కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ వచ్చింది. చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన దాదాపుగా కోలుకున్నాడు. 90 శాతం వరకు రికవరీ అయ్యాడు. ఈ విషయాన్ని విజయ్ ఆంటోనీనే స్వయంగా ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చాడు.
‘ ప్రస్తుతం 90 శాతం కోలుకున్నా. ప్రమాదంలో విరిగిన నా దవడ, ముక్కు ఎముకలు కలిసిపోయాయి. ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ మీ అందరి ప్రేమాభిమానాల వల్ల ఇప్పుడు కోలుకున్నా. గతంలో కంటే చాలా సంతోషంగా ఉన్నా. ఇవాల్టి నుంచి పిచ్చైకారన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నా. ఏప్రిల్ 2న ఈ సినిమాను విడుదల చేస్తాం’ అంటూ విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్లోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోనీ నాన్ ( నకిలీ ) సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతోనే నటుడిగా తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ఆ తర్వాత పిచ్చైకారన్ ( బిచ్చగాడు ) సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతో పాపులర్ కావడంతో తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేసేవాడు. వాటికి ఇక్కడ మంచి రెస్పాన్స్ కూడా వచ్చేది. ఈ క్రమంలో తన కెరీర్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు విజయ్ ఆంటోనీ. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ దర్శకుడిగా కూడా మారాడు. ఈ చిత్ర షూటింగ్ కోసమే చిత్ర యూనిట్‌తో కలిసి విజయ్ మలేసియా వెళ్లాడు. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. విజయ్ ఆంటోనీ ఉన్న బోటు.. చిత్ర యూనిట్ ఉన్న మరో బోటును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని ముందు కౌలాలంపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి చెన్నై ఆస్పత్రికి తీసుకొచ్చారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kiara Advani | పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన హీరోయిన్.. వారం రోజుల్లోనే వివాహం
SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?
Venu Madhav | వేణుమాధవ్ మరణానికి అసలు కారణం అదే.. సంచలన విషయం బయటపెట్టిన కమెడియన్ తల్లి సావిత్రమ్మ
Varun Tej | త్వరలోనే వరుణ్ తేజ్ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. పెళ్లికూతురు ఆమేనా?