Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentMacherla niyojakavargam | థియేటర్‌లో ఫట్.. ఓటీటీలో హిట్‌.. జీ5లో దుమ్మురేపుతున్న నితిన్‌ మాచర్ల నియోజకవర్గం

Macherla niyojakavargam | థియేటర్‌లో ఫట్.. ఓటీటీలో హిట్‌.. జీ5లో దుమ్మురేపుతున్న నితిన్‌ మాచర్ల నియోజకవర్గం

Macherla niyojakavargam | కొన్ని సినిమాలు అంతే ! థియేటర్‌లో రిలీజైన టైమ్‌ బ్యాడో.. సిచ్యూయేషన్‌ బ్యాడో తెలీదు! థియేటర్‌లో ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకుని వెళ్లిపోతాయి. తర్వాత ఎప్పుడో ఓటీటీలోనో.. టీవీల్లోనో చూసినప్పుడు అరె.. ఈ సినిమా బాగుందే.. మరి ఎందుకు డిజాస్టర్‌ అయ్యింది అని అనుకుంటాం.. మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. థియేటర్‌లో యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమాలో బుల్లితెరపై క్లాసిక్‌ చిత్రాలుగా మిగిలపోయాయి. ఇక ఈ ఓటీటీ హయాంలో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్‌ డాగ్‌, ఘోస్ట్‌ సినిమాలది కూడా అలాంటి పరిస్థితే. ఈ సినిమాలు రిలీజైతే థియేటర్‌లోకి అడుగుపెట్టిన నాథులే లేరు. కానీ ఓటీటీలో రిలీజయ్యాక రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఇదే బాటలో నితిన్‌ తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం కూడా చేరిపోయింది.

నితిన్‌, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాపై భారీ అంచనాలతో విడుదలైంది. సినిమా రిలీజ్‌కు ముందు ఈ సినిమా చాలా బజ్‌ క్రియేట్‌ చేసింది. కానీ ఆగస్టు 12న రిలీజైన ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో డిజాస్టర్‌గా థియేటర్ల నుంచి వెళ్లిపోయింది. కానీ వెంటనే ఓటీటీలోకి రాలేదు. ముందుగా నిర్మాతల మండలి పెట్టుకున్న ఒప్పందం ప్రకారం 90 రోజుల తర్వాతనే ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 9 నుంచి జీ5 యాప్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఆశ్చర్యంగా ఈ సినిమాకు ఇప్పుడు భారీ వ్యూస్‌ వస్తున్నాయి.

ఇప్పటివరకు మాచర్ల నియోజకవర్గం సినిమా 75 మిలియన్‌ మినట్స్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుందని జీ5 ప్రకటించింది. ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సినిమా బాగానే ఉంది కదా ఎందుకు నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుందా అని ఆశ్చర్యపోతున్నారు. థియేటర్‌లో సినిమా ఫ్లాప్‌ కావడానికి కారణాలను వెతుకుతున్నారు. అయితే మాచర్ల నియోజకవర్గం సినిమా రిలీజైన సమయంలోనే కార్తికేయ2 సినిమా విడుదలైంది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. ఇదే మాచర్ల నియోజకవర్గం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిందని నెటిజన్లు విశ్లేషణలు చేస్తున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News