Saturday, September 23, 2023
- Advertisment -
HomeLatest NewsLowest score in t20 match | టీ20 చరిత్రలోనే సంచలన రికార్డు.. 15 పరుగులకే...

Lowest score in t20 match | టీ20 చరిత్రలోనే సంచలన రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్‌

Lowest score in t20 match | ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ టీ20ల్లో సంచలనం నమోదైంది. అడిలైడ్‌ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌ జట్టు అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. టీ20 చరిత్రలో తొలిసారి అత్యల్ప స్కోరుకు జట్టు ఆలౌట్‌ అయింది. కేవలం 15 పరుగులకే సిడ్నీ థండర్స్‌ జట్టు ఆలౌటై పరువు పోగొట్టుకుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆడిలైట్‌ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అనంతరం 140 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు 5.5 ఓవర్లకే చేతులెత్తేసింది. కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. టీంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 4 పరుగులే కావడం విశేషం. అదీ పదో వికెట్‌గా వచ్చిన బ్రెండన్‌ డోగెట్‌ అత్యధికంగా 4 పరుగులు చేశాడు. దీంతో జట్టు 15 పరుగులైనా చేయగలిగింది.

బౌలింగ్‌లోనూ రికార్డులే..

ఆడిలైడ్‌ బౌలర్లో హెన్రీ థ్రోంటన్‌ రికార్డు ప్రదర్శన చేశాడు. కేవలం 3 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి సిడ్నీ జట్టు నడ్డి విరిచేశాడు. వెస్‌ అగర్‌ 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో 124 పరుగుల తేడాతో ఆడిలైడ్‌ జట్టు రికార్డు విజయం సాధించింది.

గత రికార్డులివే..

గతంలో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ అయిన జట్లను ఓసారి పరిశీలిస్తే.. టర్కీ, చెక్‌ రిపబ్లిక్‌ మధ్య జరిగిన టీ20లో అత్యల్ప స్కోరు నమోదైంది. చెక్‌ రిపబ్లిక్‌ కేవలం 21 పరుగులకే ఆలౌటైంది. ఇదే ఇప్పటి వరకు అతి తక్కువ స్కోరు. అటు లిస్తో, ఉగండా మధ్య జరిగిన టీ20ల్లోనూ ఉగండా 26 పరుగులే చేయగలిగింది. టర్కీ, లక్సంబర్గ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్సంబర్గ్ 28 పరుగులకే ఆలౌట్‌ అయింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

India Vs Bangladesh | బంగ్లాదేశ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు.. 150 పరుగులకే తొలిఇన్నింగ్స్‌లో ఆలౌట్

Fifa World cup 2022 | సెమీస్‌లో చిత్తుగా ఓడిన మొరాకో..ఫైనల్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News