Monday, March 27, 2023
- Advertisment -
HomeEntertainmentChiranjeevi | కష్టాల్లో ఉన్న టెక్నీషియన్‌కు చిరంజీవి భారీ ఆర్థిక సాయం.. పాకీజాకు కూడా

Chiranjeevi | కష్టాల్లో ఉన్న టెక్నీషియన్‌కు చిరంజీవి భారీ ఆర్థిక సాయం.. పాకీజాకు కూడా

Chiranjeevi | మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పేదరికంతో బాధపడుతున్న ఓ టెక్నీషియన్‌కు ఆర్థికసాయం అందజేశాడు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కెమెరామెన్‌గా సేవలందించిన దేవరాజ్‌ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని అతనికి రూ.5 లక్షలు సాయంగా అందించాడు.

దేవరాజ్‌ దాదాపు 20 సంవత్సరాల పాటు కెమెరామెన్‌గా పనిచేశాడు. తెలుగు సినిమాలకే కాకుండా అటు దక్షిణాది సినిమాలకు కూడా దేవరాజ్ కెమెరామెన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, రాజ్ కుమార్, రజనీకాంత్, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, మురళీమోహన్, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ వంటి వారి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. దాదాపు 8 భాషల్లో 300 కు పైగా సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశాడు.

ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన దేవరాజ్ ప్రస్తుతం ఆర్థికంగా చితికిపోయాడు. తాజాగా ఈ విషయాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. దేవరాజ్‌ పడుతున్న కష్టాలను తెలుసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. అతన్ని ఇంటికి పిలిపించుకున్నాడు. రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఇకపై ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనకు చిరంజీవి చేసిన ఆర్థిక సాయం గురించి దేవరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. తన పేదరికం గురించి తెలుసుకుని వెంటనే స్పందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని కొనియాడారు. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా గా నటించిన నటి వాసుకికి కూడా చిరంజీవి ఆర్థిక సాయం అందజేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ లో వచ్చిన ఆమె ఇంటర్వ్యూ చూసి ఇప్పటికే ఆమెకి మెగా బ్రదర్ నాగబాబు రూ.లక్ష రూపాయలు సాయం చేశారు. చిరంజీవి కూడా ఆమెకు లక్ష రూపాయలు పంపించారు. ఆమెకు సినిమాల్లో, బుల్లితెర మీద అవకాశాలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. చిరంజీవి ఆర్థిక సాయం అందించడం పై పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో కలిసి నటించికపోయినప్పటికీ ఆయన చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోలేనిదని ఆమె అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vijay Antony | బిచ్చగాడు హీరో లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్.. విజయ్ ఆంటోనీకి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..

Kiara Advani | పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన హీరోయిన్.. వారం రోజుల్లోనే వివాహం

Tollywood | టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నమూత

SSMB28 | అమ్మో.. మహేశ్, త్రివిక్రమ్ మూవీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా?

Movies of The Week | ఈ వారం ఓటీటీ, థియేటర్లలో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News