Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentWaltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Waltair Veerayya | దుమ్మురేపుతున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్..మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

Waltair Veerayya | వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. డీఎస్పీ అందించిన మొదటి రెండు పాటలతో ఫ్యాన్స్ చాలా డీలా పడిపోయారు. బాలకృష్ణ వీరసింహరెడ్డి సినిమా కోసం తమన్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తుంటే.. దేవీశ్రీ ప్రసాద్ మాత్రం అంతంత మాత్రంగానే ట్యూన్స్ ఇస్తున్నాడనే విమర్శలు వచ్చేశాయి. పైగా వాల్తేరు వీరయ్యలోని మొదటి రెండు పాటలు కూడా డీఎస్పీనే రాయడంతో ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత మరింత ఎక్కువైపోయింది. మంచి ట్యూన్స్ఇస్తే అయిపోతుంది కదా.. లిరిక్స్ అవసరమా అంటూ సెటైర్లు కూడా వచ్చేశాయి.కానీ తాజాగా విడుదలైన మూడో సాంగ్ ఆ కామెంట్స్ అన్నింటినీ పక్కకు నెట్టేసింది.

ఇప్పటివరకు సెటైర్లు వేసిన వారితోనే శభాష్ అనిపించుకుంటున్నాడు డీఎస్పీ. ఇది కదా మాక్కావాల్సిన పాట.. మెగాస్టార్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే.. ఇప్పుడు చూడు ఎంతమంచి ట్యూన్ ఇచ్చావ్ అంటూ దేవిని పొగిడేస్తున్నారు. దుమ్ము లేపే ట్యూన్‌తో వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ వచ్చేసింది. పైగా చంద్రబోస్ లిరిక్స్ కూడా అదిరిపోయాయి. చాలా రోజుల తర్వాత చిరు ఇమేజ్‌కు సరిపోయే పాట పడిందంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆచార్య, గాడ్ ఫాదర్ పాటలకు కూడా ఊహించిన రెస్పాన్స్ రాలేదు. నిజం చెప్పాలంటే ఖైదీ నెం 150 తర్వాత ఆ రేంజ్ మ్యాజిక్ చేసే ఆల్బమ్ లేదు.

ఇలాంటి సమయంలో వాల్తేరు వీరయ్యపై ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అందులోనూ బాస్ పార్టీ మొదట్లో టాక్ తేడాగా ఉన్నా.. వినగా వినగా బాగానే సింక్ అయిపోయింది. కానీ శ్రీదేవి పాటకు మాత్రం ఊహించిన రెస్పాన్స్ అస్సలు రాలేదు. ఇప్పటికీ దీనిపై పెద్దగా రియాక్షన్ లేదు అభిమానుల్లో. కానీ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ మాత్రం ఇన్‌స్టంట్ హిట్ అయిపోయింది. పైగా సినిమాలో పిక్చరైజేషన్ కూడా కుమ్మేసి ఉంటాడని లిరికల్ సాంగ్ చూస్తుంటే అర్థమైపోతుంది. చిరు గెటప్ సైతం 1990ల్లో ఉన్నట్లే అనిపిస్తుంది. మొత్తానికి వీరయ్య టైటిల్ సాంగ్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేసింది. ఇదే రేంజ్‌లో నెక్ట్స్ సాంగ్స్ కూడా ఉంటే.. మెగాస్టార్ సంక్రాంతికి రచ్చ చేయడం ఖాయం.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Prabhas | 21 కోట్లు అప్పు తీసుకున్న ప్రభాస్.. కారణం అదేనా?

Sushant singh rajput | సుశాంత్‌ సింగ్‌ది హత్యనే.. పోస్టుమార్టం చేసిన డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Krithi shetty | ఇంత చిన్న రీజన్‌కే బాలీవుడ్ ఆఫర్‌ వదిలేసుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి

Prabhas in Raja Deluxe | వింటేజ్ లుక్‌లో కేక పుట్టిస్తున్న ప్రభాస్.. రాజా డీలక్స్ నుంచి లీకైన పిక్స్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News