Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsDavid Warner Double century | మూడేళ్ల తర్వాత సెంచరీ దాహం.. వందో టెస్టులో డేవిడ్...

David Warner Double century | మూడేళ్ల తర్వాత సెంచరీ దాహం.. వందో టెస్టులో డేవిడ్ వార్నర్ డబుల్ ధమాకా

David Warner Double century | కొన్నాళ్లుగా ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్ తన వందో టెస్టులో రికార్డు సృష్టించాడు. మూడేళ్ల తర్వాత తన సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. సింగిల్ కాదు.. డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భాగంగా మెల్‌బోర్న్‌లో జరుగుతున్న టెస్టులో 254 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. దీంతో ఎంసీజీ మైదానం మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.

అద్భుతంగా బ్యాటింగ్ చేసిన వార్నర్..డబుల్ సెంచరీ చేసే సరికి తీవ్రంగా అలసిపోయాడు. దీంతో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న డేవిడ్ వార్నర్‌.. ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. వందో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. గతంలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ ఈ రికార్డును సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 189 పరుగులకే ఆలౌటైంది. 45/1 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 91 ఓవర్ల వద్ద 3 వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Cristiano Ronaldo | రొనాల్డోకు రోల్స్ రాయల్ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రియసి.. కారణం ఏంటంటే..

Nikhat Zareen | తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఖాతాలో మరో టైటిల్..

IND vs BAN | బంగ్లాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్.. డబ్ల్యూటీసీ ర్యాంకులో రెండో స్థానానికి దూసుకొచ్చిన టీమిండియా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News