Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentRashmi Gautham | జబర్దస్త్ యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం..

Rashmi Gautham | జబర్దస్త్ యాంకర్ రష్మి ఇంట్లో తీవ్ర విషాదం..

Rashmi Gautham | జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రష్మి వాళ్ల అమ్మమ్మ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చెబుతూ రష్మి కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన గుండెతో ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికామని వెల్లడించారు.

తన గ్రాండ్ మదర్ మరణ వార్తను సోషల్ మీడియాలో పంచుకున్న రష్మి గౌతమ్.. ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకుంది. ప్రమీలా మిశ్రా ఎంతో స్ట్రాంగ్ విమెన్ అని.. ఆమె ప్రభావం తనపై ఎంతో ఉందని పేర్కొంది. ఆమె దూరమైనా.. తన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తమతోనే ఉంటాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మి పెట్టిన పోస్టు చూసిన నెటిజన్స్ ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

రష్మి గౌతమ్ విషయానికొస్తే సినిమాల్లో అవకాశాల కోసం వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించింది. తెలుగు, తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీ చిత్రంతో చిన్న పాత్రలో కనిపించింది. కానీ అవేవీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. మల్లెమాల ప్రొడక్షన్స్ మొదలుపెట్టిన జబర్దస్త్ షోకి యాంకర్‌గా అడుగుపెట్టడంతో ఆమె జీవితం మారిపోయింది. ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో కష్టపడితే రాని గుర్తింపు ఈ షోతో తెచ్చుకుంది. తెలుగు వాళ్లందరికీ ఫేవరేట్ యాంకర్‌గా మారింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ మరింత పాపులర్ చేసింది. ఇక్కడ వచ్చిన క్రేజ్‌తో అప్పుడప్పుడు సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | గోల్డెన్‌ వీసా అందుకున్న అల్లు అర్జున్‌.. యూఏఈ ఇచ్చే ఈ వీసా ఎందుకంత స్పెషల్‌?

Jabardasth | జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాత పెళ్లి ఫిక్స్.. ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్

Trisha | విజయ్ ఇంటికి సమీపంలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొన్న త్రిష

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News