Home Entertainment Vishal Marriage | ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే.. నేనూ చేసుకుంటా.. విశాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Vishal Marriage | ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే.. నేనూ చేసుకుంటా.. విశాల్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Vishal Marriage | టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసే వాళ్లు చాలామందే ఉన్నారు. నాలుగు పదుల వయసు దాటడంతో డార్లింగ్‌ పెళ్లి విషయంలో ఎప్పుడూ ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంది. అలా వార్తలు వచ్చిన ప్రతిసారి అది నిజమైతే బాగుండు అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కానీ ఆ రూమర్స్.. రూమర్స్‌లాగే మిగిలిపోతున్నాయి. వీటిపై ప్రభాస్‌ అయితే కనీసం నోరు కూడా మెదపడం లేదు. దీంతో ప్రభాస్‌కు పెళ్లెప్పుడు అవుతుందా అని అనుకుంటూ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలుగులో ప్రభాస్‌ పెళ్లి ఎలా అయితే ట్రెండింగ్‌ అవుతుందో తమిళంలో విశాల్‌ పెళ్లి కూడా అలాగే మిగిలిపోయింది. అప్పుడెప్పుడో ఒక ఇంటివాడు కావాల్సిన విశాల్‌.. ఇప్పటికీ ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. దీంతో పెళ్లెప్పుడు బాబూ అని మీడియా అడగడంతో ప్రభాస్‌ పెళ్లికి ముడిపెట్టి తెలివిగా తప్పించుకున్నాడు విశాల్‌.

హైదరాబాద్‌కు చెందిన అనూష అనే అమ్మాయితో అప్పట్లో విశాల్‌కు పెళ్లి నిశ్చయమైంది. వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ పెళ్లిపీటలు ఎక్కేలోపే సంబంధం క్యాన్సిల్‌ చేసుకున్నారు. ఆ తర్వాత వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్‌ రిలేషన్‌లో ఉన్నాడని ప్రచారం జరిగింది. తర్వాత ఇద్దరికీ బ్రేకప్‌ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కొద్దిరోజులుగా పలు సినిమాల్లో చెల్లెలు పాత్రలు చేసిన నటి అభినయతో విశాల్‌ డేటింగ్‌లో ఉన్నాడని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

తాజాగా లాఠీ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న విశాల్‌ను దీనిపై మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానమిస్తూ ఓ నటితో డేటింగ్‌లో ఉన్నానని ఒప్పుకున్నాడు. కానీ ఆమె ఎవరో చెప్పేందుకు విశాల్‌ నిరాకరించాడు. అభినయ పేరు ప్రస్తావిస్తే ఆమె కాదని మాత్రం స్పష్టం చేశాడు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగ్గా.. ప్రభాస్‌ పెళ్లి చేసుకున్న రోజే నేనూ చేసుకుంటానని చెప్పి దాటవేశాడు.
నాలుగేళ్లుగా పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఇలాగే ఏదో ఒకదానికి ముడిపెడుతూ తప్పించుకుంటున్నాడు. 2019లో నడిగర్‌ సంఘం భవనం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడేమో ప్రభాస్‌ పెళ్లితోనే తన పెళ్లి అని చెప్పి దాటవేశాడు విశాల్‌.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sukrithi Ambati | ప్రియుడితో పెళ్లిపీటలు ఎక్కిన కేరింత భావన.. ఫొటోలు వైరల్‌

Prabhas Shirt | బాలయ్య షోలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Exit mobile version