Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentVeera simhareddy in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య వీరసింహారెడ్డి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Veera simhareddy in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలయ్య వీరసింహారెడ్డి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Veera simhareddy in OTT | అఖండ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయం సాధించింది. తనదైన స్టైల్‌ ఫైట్స్‌, పంచ్‌ డైలాగ్స్‌తో ఈ సినిమా నందమూరి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. హనీ రోజ్‌ గ్లామర్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ విలనిజం ఇవన్నీ కూడా సినిమాకు మంచి క్రేజ్‌ తెచ్చుకొచ్చాయి. సంక్రాంతి పండుగకు థియేటర్లలో విజిల్స్‌ పెట్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమైంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.

వీరసింహారెడ్డి సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ దక్కించుకుంది. ఈ సినిమా రిలీజైన ఆరు వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 23వ తేదీన ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని హాట్‌స్టార్‌ భావిస్తోంది. ఈ మేరకు అఫిషియల్‌ ప్రకటన చేసింది. ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గంటల నుంచి తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీరసింహారెడ్డి సినిమా స్ట్రీమింగ్‌ అవుతుందని ట్విట్టర్‌ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Tarakarathna | తారకరత్నను విదేశాలకు తీసుకెళ్తున్నారా? నందమూరి కుటుంబసభ్యులు ఇచ్చిన హెల్త్ అప్‌డేట్ ఇదీ

Nawazuddin Siddiqui | అతని కోసం నా లైఫ్‌లో 18 ఏళ్లు వేస్ట్‌ చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న నవాజుద్దీన్‌ భార్య ఆలియా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News