Home Entertainment Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Anjali Marriage | అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. పెళ్లి వార్తలపై స్పందించిన అంజలి

Anjali Marriage | ఇండస్ట్రీలో హీరోయిన్ల పెళ్లిళ్లపై ఇప్పుడు వార్తలు రావడం కామన్ అయిపోయింది. మూడు పదుల వయసు దాటితే చాలు ఫలానా హీరోయిన్ పెళ్లి సెటిల్ అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. తమన్నా, కీర్తి సురేశ్, సాయిపల్లవి, అనుష్క ఇలా చాలామంది హీరోయిన్ల పెళ్లిపై రూమర్లు ఇటీవల కాలంలో వైరల్‌గా మారాయి. వీళ్లతో పాటు అంజలి పెళ్లి కూడా జరిగిందనే ప్రచారం జరిగింది. అమెరికాకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ను అంజలి పెళ్లి చేసుకుందనే పుకార్లు జోరుగా వినిపించాయి. ఈ క్రమంలో ఆ రూమర్స్‌పై అంజలి స్పందించింది. తాజాగా ఫాల్ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొన్న అంజలి.. తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చింది.

అంజలి పెళ్లిపై ఇప్పుడే కాదు గతంలో కూడా రూమర్స్ వచ్చాయి. కోలీవుడ్ నటుడు జైతో అంజలి రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి.జర్నీ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు అమెరికాకు చెందిన బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ రూమర్స్‌పై అంజలి స్పందించింది. ఇండస్ట్రీలో ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారని.. ఎవరితో స్నేహంగా ఉంటాననేది తన వ్యక్తిగత విషయమని తెలిపింది. ఇక అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో తనకు పెళ్లయ్యిందని వచ్చిన వార్తలో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని పేర్కొంది. అయితే కచ్చితంగా ఏదో రోజు పెళ్లి చేసుకుంటానని.. ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ తప్పకుండా చెబుతానని చెప్పింది.

తన జీవితంలో ఎదురైన చేదు సంఘటన గురించి కూడా అంజలి చెప్పుకొచ్చింది. కొంతకాలం క్రితం ఒక విషపూరితమైన రిలేషన్‌లో ఉన్నానని వెల్లడించింది. ఆ బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని తెలిపింది. కానీ ఆ రిలేషన్ తాను ఊహించుకున్నంత అందంగా లేదని పేర్కొంది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పడానికి అంజలి నిరాకరించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ramcharan – Upasana | మెగా అభిమానులకు గుడ్‌న్యూస్.. తండ్రి కాబోతున్న రామ్‌చరణ్

Pawan kalyan new movie | పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా టైటిల్ ఫిక్సయిందా.. అదే టైటిల్ అయితే ఫ్యాన్స్ కి పూనకమే!

Nandamuri Balakrishna new movie | బాలకృష్ణ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందా? బాలయ్య కోసం అనిల్ రావిపూడి రూటు మార్చేస్తున్నాడా ?

Anupama Parameswaran | అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమ పరమేశ్వరన్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎందుకు కాలేకపోయింది?

Exit mobile version