Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowAadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్...

Aadhar Card Download | ఆధార్, పాన్ కార్డు అన్నీ వాట్సాప్ నుంచే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Aadhar Card Download | ఆధార్ కార్డు ఇప్పుడు చాలావాటికి మస్ట్‌గా మారిపోయింది. ఆధార్ కార్డు ఎప్పుడు ఎక్కడ అవసరం పడుతుందో చెప్పలేం. అలా అవసరం అయిన సమయంలో మీ పర్స్‌లో ఆధార్ కార్డు లేదనుకోండి పరిస్థితి ఏంటి? ఏ మెయిల్‌లోనో, గూగుల్ డ్రైవ్‌లోనో సేవ్ చేసుకుని ఉంటాం కదా.. అందులో వెతికేస్తామని అంటారా? అక్కడ కూడా దొరకలేదనుకోండి.. ఇక ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందే. కానీ అంత రిస్క్ లేకుండా కేవలం వాట్సాప్ ద్వారా చిటికెలో ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలుసా ! ఆధార్ ఒక్కటే కాదు పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ ఇలా చాలా డాక్యుమెంట్లను వాట్సాప్ నుంచే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ ద్వారానే అన్ని ఐడీ కార్డులు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారా? మీకు డిజిలాకర్ సర్వీస్ గురించి ఐడియా ఉంది కదా. ఇందులో గవర్నమెంట్ జారీ చేసిన ఏ ఐడీ కార్డు అయినా, డాక్యుమెంట్లను అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న డాక్యుమెంట్లను ఒరిజినల్స్‌లానే భావిస్తారు. అందుకే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ డిజీలాకర్ సర్వీసెస్.. వాట్సాప్‌లోకి వచ్చాయి. ఒకవేళ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉండి.. అందులో మీ డాక్యుమెంట్స్, ఐడీకార్డులను సేవ్ చేసుకొని ఉంటే.. వాళ్ల హెల్ప్‌లైన్ నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేయడం ద్వారా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • ముందుగా మైగవర్నమెంట్ హెల్ప్ డెస్క్ నంబర్ 9013151515 నంబర్‌ ముందు +91 కోడ్ జత చేసి మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి మైగవర్నమెంట్ హెల్ప్ డెస్క్ నంబర్‌ కాంటాక్ట్‌ను ఓపెన్ చేయాలి.
  • ఆ నంబర్‌కు హాయ్ లేదా నమస్తే అని ఒక మెసేజ్ పంపించాలి.
  • అప్పుడు డిజిలాకర్ సర్వీసెస్, కొవిన్ ఆన్ వాట్సాప్ అనే రెండు ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి.
  • ఆ రెండింటిలో డిజిలాకర్ సర్వీసెస్‌ను ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి.
  • డిజిలాకర్ అకౌంట్‌కు లింక్ అయిన 12 అంకెల ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • అప్పుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఆ చాట్‌బాక్స్‌లో ఎంటర్ చేయాలి.
  • ఓటీపీ ఎంటర్ చేయగానే డిజిలాకర్‌లో సేవ్ అయిన డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో మనకు కావాల్సిన డాక్యుమెంట్‌ లేదా ఐడీ కార్డుపై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • డౌన్‌లోడ్ చేసిన ఫైల్ మన మొబైల్‌లో పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది.
  • అప్పుడు డిజిలాకర్‌లో సేవ్ అయిన అన్ని డాక్యుమెంట్లు కనిపిస్తాయి. ఇందులో మనకు కావాల్సిన డాక్యుమెంట్, ఐడీకార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు
  • డౌన్లోడ్‌ అయిన ఫైల్ పీడీఎఫ్ రూపంలో సేవ్ అవుతుంది

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Image Blur Tool in Whatsapp | ఫొటోలు పంపేందుకు సరికొత్త ఫీచర్.. ఇక ఆ యాప్‌లతో పనిలేదు

5G Mobiles Under 20000 | బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న 5జీ మొబైల్స్ ఇవే

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News