Thursday, September 28, 2023
- Advertisment -
HomeBusinessIncome Tax | వేతన జీవులకు పాత పన్ను విధానం బెటరా.. కొత్త పన్ను విధానమా...

Income Tax | వేతన జీవులకు పాత పన్ను విధానం బెటరా.. కొత్త పన్ను విధానమా ?

Income Tax | టాక్స్‌ చెల్లింపులో విషయంలో మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ముఖ్యంగా కొత్త స్లాబ్ విధానంలో వేతన జీవులకు మరింత ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారు కూడా. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుకు ఉపశమనం కలిగేలా ఈ మార్పులు చేపట్టినట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వివరించారు కూడా. కొత్త పన్ను చెల్లింపు విధానం డీ ఫాల్ట్‌‌గా ఉంటుందని, అయితే, పన్ను చెల్లింపుదారు కోరుకుంటే, పాత విధానాన్ని వారికి కొనసాగించనున్నట్లు మంత్రి వివరించారు.

దాంతో ఏ విధానం ఎంచుకోవాలో తెలియని పరిస్థితి చెల్లింపుదారుల్లో ఉంది. ఏ విధానంలో ఎక్కువ రాయితీ లభిస్తుందో లెక్కకట్టిన తరువాత పాత విధానంలో కొనసాగించడమా..? లేక కొత్త విధానానికి మారడమా? అనే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

గతంలో ఈ రెండు విధానాల్లో రూ.5 లక్షల వరకు పన్ను ఉండేది కాదు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో మొదటి రూ.3 లక్షలకు పన్ను ఉండదు. మిగతా నాలుగు లక్షలకు పన్ను రిబేటు లభిస్తుంది. కొత్త టాక్స్‌ ల విధానంలో స్లాబుల సంఖ్యను ఐదుకు తగ్గించారు. కొత్త విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ సదుపాయం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు.

రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగి రూ.52,500 స్టాండర్డ్‌ డిడక్షన్ సదుపాయం పొందుతారు. ఈ రెండు విధానాల్లో ఏది బెటర్‌ అనే విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కొత్త ట్యాక్స్ విధానంలో 80 సీ, 80 డీ తదితర సెక్షన్ల కింద మినహాయింపులేవీ ఉండవు. పాత పన్ను విధానంలో ఆ మినహాయింపులు కొనసాగుతూనే ఉంటాయి. ఈ రెండు విధానాల్లో రూ. 5లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు.

మొత్తంగా ప్రముఖ టాక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ప్లాట్ ఫామ్ ‘క్లియర్’ తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎలాంటి మినహాయింపులు పొందని వారికి కొత్త స్లాబ్ విధానం లాభదాయకం. మినహాయింపులు పొందేవారు మాత్రం రెండు విధానాలలో చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించి, తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉన్న విధానాన్ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

K.Viswanath | కళాతపస్వి మరణానికి కొద్ది క్షణాల ముందు జరిగింది ఇదే.. పాట రాయడం మొదలుపెట్టిన కాసేపటికే..

K.Viswanath | చిరంజీవి, కమల్‌ హాసన్‌కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Nirmala Sitharaman | బడ్జెట్‌ ప్రసంగంలో టంగ్‌ స్లిప్‌ అయిన నిర్మలమ్మ.. సభలో విరబూసిన నవ్వులు

Niramala Sitharaman | బడ్జెట్‌లో ఇప్పటిదాకా నిర్మలా సీతారామన్‌ రికార్డులు ఇవే.. ఈసారి మాత్రం కాస్త స్పెషల్‌ !

Income Tax Slabs Budget 2023 | బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపన్ను పరిమితి రూ. 7లక్షలకు పెంపు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News