Tuesday, April 30, 2024
- Advertisment -
HomeNewsInternationalChina | కొత్త దంపతులకు చైనా బంపర్ ఆఫర్.. నెలరోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు!

China | కొత్త దంపతులకు చైనా బంపర్ ఆఫర్.. నెలరోజులు ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు!

China | జనాభా నియంత్రణ కోసం చైనా తీసుకున్న కఠిన నిర్ణయాలే ఇప్పుడు ఆ దేశం కొంపముంచాయి. ఒకరు ముద్దు.. ఇద్దరు వద్దు అనే నినాదంతో కుటుంబ నియంత్రణను చాలా కఠినంగా అమలు చేయడమే ఇప్పుడు డ్రాగన్ దేశానికి శాపంగా మారింది. మొన్నటి దాకా కొనసాగిన ఈ నినాదంతో యువతకు పెళ్లి చేసుకోవాలి.. పిల్లల్ని కనాలనే ఆశ సన్నగిల్లింది. దీంతో చాలామంది యువతీయువకులు ఒంటరిగానే ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా పిల్లల్ని కనేందుకు ఇష్టపతారు. ఈ క్రమంలో జనాభాను పెంచేందుకు చైనా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పెళ్లి కాకున్నా పిల్లల్ని కనొచ్చని.. ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కల్పిస్తామని యూత్‌కు బంపరాఫర్ కూడా ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన వాళ్లకు కూడా అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.

ఇప్పటిదాకా చైనాలో పెళ్లి చేసుకుంటే కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చేవారు. అంతకుమించి ఎక్కువ రోజులు సెలవులు పెట్టడానికి ఒప్పుకోరు. కానీ ఇప్పుడు చైనాలోని ప్రావిన్స్‌ల్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే నెల రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చని ప్రకటించింది. ఆ నెల రోజులు కూడా వేతనంతో కూడిన సెలవులే ఇస్తామని గుడ్‌న్యూస్ చెప్పింది. ఇలా కొత్తగా పెళ్లయిన జంటకు నెల రోజులు ఆఫీస్, వర్క్ అనే టెన్సన్స్ ఏవీ లేకపోతే ఏకాంతంగా గడిపేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని చైనా ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా జననాల రేటు పెంచవచ్చని ఆశపడుతుంది.

విపరీతంగా పెరిగిపోతున్న జనాభాను అదుపులోకి తీసుకొచ్చేందుకు 1980 నుంచి 2015 మధ్యలో వన్ చైల్డ్ పాలసీని చైనా ప్రభుత్వం అమలు చేసింది. దీన్ని చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేయడంతో జనాభా చాలావరకు తగ్గింది. అయితే మూడు దశాబ్దాలకు పైగా ఇంతటి కఠిన నిర్ణయం ఉండటంతో అక్కడి జనాభా దీనికి అలవాటు పడిపోయారు. ఇక ఇప్పటి యువత అయితే పెళ్లి చేసుకుని పిల్లలను కనడం అవసరమా అనే నిర్ణయానికి వచ్చేశారు. దీంతో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నా పిల్లలను కనేందుకు ఆసక్తి చూపట్లేదు. దీంతో కొత్త జననాలు గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అది దేశ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చైనా గమనించింది. అందుకే పెళ్లిపైకి యువత మనసు మళ్లేందుకు రకరకాలు ప్రయత్నాలు చేస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitte

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News