Tuesday, May 7, 2024
- Advertisment -
HomeLatest NewsIRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్‌ టికెట్‌ను ఏసీ కోచ్‌లోకి మార్చుకోవాలా? ఇలా...

IRCTC Train Ticket | జర్నీలోనే మీ స్లీపర్‌ టికెట్‌ను ఏసీ కోచ్‌లోకి మార్చుకోవాలా? ఇలా చేస్తే సరి !!

IRCTC Train Ticket | సికింద్రాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళ్లేందుకు రవి ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఎలాగూ చలికాలమే కదా చల్లగానే ఉంటుందని స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్నాడు. తీరా జర్నీ రోజు ఫుల్‌ ఎండ ఉంది. స్లీపర్‌లో వెళ్తుంటే చెమటకు చికాకు లేస్తోంది. ఎంచక్కా థర్డ్‌ ఏసీలో టికెట్‌ బుక్‌ చేసుకుని ఉంటే బాగుండు అని తనలో తనే బాధపడుతూ ఉండిపోయాడు. రవి ఒక్కడే కాదు చాలామంది ఇలాంటి సిట్యూయేషన్‌ ఎదుర్కొనే ఉంటారు. స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ తీసుకుని రైలు ఎక్కిన తర్వాత ఏసీ టికెట్‌ అయితే బాగుండనే ఫీలింగ్‌ చాలామందికి వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు. ఎలాగూ టికెట్‌ బుక్‌ చేసుకున్నాం కదా అని అందులోనే అడ్జస్ట్‌ అయ్యి వెళ్లిపోతారు కదా ! ఇకపై అలా అడ్జస్ట్‌ అయ్యి వెళ్లాల్సిన పని ఏమీ లేదు. జర్నీలోనే మీ స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ను ఏసీ టికెట్‌గా అప్‌గ్రేడ్‌ చేసుకుని హాయిగా వెళ్లిపోవచ్చు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా?

ప్రయాణికులు సౌలభ్యం కోసం భారత రైల్వే అనేక మార్పులు తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే రైలులో ప్రయాణిస్తూనే ట్రైన్‌ టికెట్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అంటే స్లీపర్‌ క్లాస్‌ నుంచి థర్డ్‌ ఏసీ లేదా ఫస్ట్‌, సెకండ్‌ ఏసీ కోచ్‌ల్లోకి కూడా మీ సీటు మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు టీటీఈని కలవాల్సి ఉంటుంది. టీటీని కలిసి ఏసీ కోచ్‌లో ఖాళీలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి. ఏ కోచ్‌లో ఏ బెర్త్‌ ఉందో తెలుసుకున్న తర్వాత నచ్చితే అందులోకి అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చు. దీనికోసం కొంచెం రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

ఎంత ఛార్జీ చేస్తారు?

టికెట్‌ అప్‌గ్రేడ్‌ చేసుకుంటే కొంత ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది. అలా అని అదనంగా ఏమీ చెల్లించాల్సి ఉండదు. టికెట్‌ ధరను మాత్రమే కట్టాల్సి ఉంటుంది. వివరంగా చెప్పాలంటే.. మీరు స్లీపర్‌ నుంచి థర్డ్‌ ఏసీలోకి మారాలని అనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు థర్డ్‌ ఏసీ టికెట్‌ ధర ఎంత ఉంటుందో దానిలో నుంచి స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర తీసేయాలి. మిగిలిన బ్యాలెన్స్‌ను టీటీఈకి చెల్లించాలి. అప్పుడు ఏసీ కోచ్‌లో ఉన్న బెర్త్‌ను మీకు కేటాయిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IRCTC Train Ticket Transfer | రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మీ టికెట్ ఇలా వేరే వాళ్ల పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేయండి

Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News