Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsYoutube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

Youtube shorts | యూట్యూబ్‌లో షార్ట్స్‌ చేసేవారికి గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే లక్షలు సంపాదించవచ్చట

Youtube shorts | యూట్యూబ్‌ ద్వారా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? మీకో గుడ్‌ న్యూస్‌. ఇప్పటి వరకు వీడియోలకు మాత్రమే డబ్బులు ఇచ్చిన యూట్యూబ్‌.. ఇకపై షార్ట్స్‌తో కూడా సంపాదించుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఈ క్రమంలో మానిటైజేషన్‌ మాడ్యూల్‌లో మార్పులు చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త మానిటైజేషన్‌ రూల్స్‌ను తీసుకొస్తున్నట్టు గూగుల్‌ ప్రకటించింది. యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోల మధ్య వచ్చే యాడ్స్‌ ద్వారా ఆదాయం పొందవచ్చని పేర్కొంది. ఈ మేరకు బ్లాగ్‌పోస్టులో వివరంగా రాసుకొచ్చింది.

యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోలు చేసే క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌ (వైపీపీ) కింద రివార్డులు ఇస్తున్నారు. యూట్యూబ్‌ కమ్యూనిటీ కింద ఒరిజినల్‌ కంటెంట్‌తో షార్ట్‌ వీడియోలు చేసే ఈ రివార్డు కింద కొంత మొత్తాన్ని అందజేస్తుంది. దీని కోసం 100 మిలియన్‌ డాలర్లను యూట్యూబ్‌ కేటాయించింది. అయితే ఈ యూట్యూబ్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇందులో భాగంగా షార్ట్‌ వీడియోలను కూడా మానిటైజ్‌ చేయాలని నిర్ణయించింది. దీనికోసం కొత్త అగ్రిమెంట్‌ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే మీరు క్రియేటర్‌ అయ్యి ఉండి.. వైపీపీ అగ్రిమెంట్‌ పొందినప్పటికీ ఈ కొత్త విధానానికి మీ అనుమతి చెప్పాల్సి ఉంటుంది. ఈ మానిటైజేషన్‌ విధానానికి మీరు ఓకే చెబితేనే మీ షార్ట్‌ వీడియోలు మానిటైజ్‌ అవుతాయి. అప్పుడు మీ ఛానెల్‌లో షార్ట్ వీడియోలు చూస్తున్నప్పుడు వాటి మధ్యలో యాడ్స్‌ వస్తాయి. దీని ద్వారా యూట్యూబ్‌ క్రియేటర్స్‌ డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఈ కొత్త విధానానికి ఈ ఏడాది జూలై 10లోపు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలను అంగీకరించిన యూట్యూబ్‌ ఛానళ్ల వైపీపీ, మానిటైజేషన్‌ అగ్రిమెంట్‌ క్యాన్సిల్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

apple | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కంపెనీలో ఉద్యోగాలు పొందే బంపర్ ఛాన్స్

ChatGPT | అసలేంటి చాట్‌జీపీటీ.. మనిషి జీవితాన్ని నిజంగానే మార్చే శక్తి ఉందా? విద్యా సంస్థలు ఎందుకు భయపడుతున్నాయి?

Amazon Offers | బంపర్‌ ఆఫర్‌.. 32వేల రూపాయల 5జీ ఫోన్‌ కేవలం 8వేలకే..

whatsapp | ఇకపై చాట్‌ బ్యాకప్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.. అదిరిపోయే ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News