Home Lifestyle Do you know Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Whatsapp Tricks | ఫోన్ నంబ‌ర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెసేజ్ ఇలా పంపించండి

Whatsapp Tricks | ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ వాట్సాప్‌ను వాడుతున్నారు. మెసేజ్‌లు చేయాల‌న్నా.. వీడియో కాల్స్ మాట్లాడాల‌న్నా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీన్నే వినియోగిస్తున్నారు. ఈ మ‌ధ్య బ్యాంకులు, ప‌లు కంపెనీలు కూడా వాట్సాప్ ద్వారానే క‌స్ట‌మ‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నాయి. అంటే వాట్సాప్ ఎంత‌లా ప్ర‌జ‌ల జీవితంలో భాగ‌మైందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే వాట్సాప్ ద్వారా ఎవ‌రికైనా మెసేజ్ చేయాలంటే వాళ్ల నంబ‌ర్ మ‌న మొబైల్‌లో సేవ్ చేసి ఉండాలి. అప్పుడే మెసేజ్ చేయ‌డం వీల‌వుతుంది. స్నేహితులు, బంధువులు, కొలిగ్స్ నంబ‌ర్ల అంటే ఓకే కానీ కొన్నిసార్లు మెకానిక్‌, ప్లంబ‌ర్‌, ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఇలా కొంత‌మంది బ‌య‌ట వ్య‌క్తుల‌కు కూడా మెసేజ్ చేయాల్సి వ‌స్తుంది. వాళ్ల‌తో ఒక‌టి రెండుసార్లు మిన‌హాయిస్తే పెద్ద‌గా అవ‌స‌రం ప‌డ‌క‌పోవచ్చు. అలాంట‌ప్పుడు వాళ్ల నంబ‌ర్ సేవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఒక ట్రిక్ యూజ్ చేసి.. ఈజీగా వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు.

అదెలా అంటే..

➤ ముందుగా మీ మొబైల్‌లోని బ్రౌజ‌ర్ ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత అందులో http://wa.me/xxxxxxxxxxx వెబ్‌సైట్ నేమ్‌ను అడ్ర‌స్‌బార్‌లో ఎంట‌ర్ చేయాలి.
➤ ఇక్క‌డ xxxxxxxxxxx అంటే మ‌న దేశ కోడ్ (91)తో క‌లిపి ప‌ది అంకెల మొబైల్ నంబ‌ర్‌ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది
అలా అడ్ర‌స్ బార్‌లో http://wa.me/(కంట్రీ కోడ్‌) ( ప‌ది అంకెల మొబైల్ నంబ‌ర్ ) ఎంట‌ర్ చేయ‌గానే వాట్సాప్ వెబ్‌సైట్‌లో పేజీ ఓపెన్ అవుతుంది.
➤ ఆ పేజీలో గ్రీన్ క‌ల‌ర్‌లో మెసేజ్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయ‌గానే రీడైరెక్ట్ అయి వాట్సాప్ యాప్ ఓపెన్ అవుతుంది.
అప్పుడు స‌ద‌రు నంబ‌ర్‌ను సేవ్ చేసుకోకుండా సులువుగా మెసేజ్ చేయొచ్చు.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Anklets | ఆడపిల్లలు కాళ్లకు వెండి పట్టీలే ఎందుకు ధరించాలి.. బంగారు పట్టీలు ధరిస్తే ఏమవుతుంది?

Digital Rupee | RBI తీసుకొచ్చే డిజిటల్‌ రూపాయితో సామాన్యులకు లాభమేంటి ? ఎవరు వాడొచ్చు.. ఎంత వరకు

Exit mobile version