Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsWhatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Whatsapp | వాట్సాప్‌లో ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను ఒకేసారి సెలెక్ట్ చేసి ఇతరులకు పంపిస్తుంటాం. లేదా డిలీట్ చేస్తుంటాం. మల్టీపుల్ చాట్ సెలక్షన్ అని పిలవబడే ఈ ఫీచర్‌ను గతేడాది వాట్సాప్ తొలగించింది. డెస్క్‌టాప్ యాప్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను తీసేసింది. ప్రస్తుతం మొబైల్ యాప్, వాట్సాప్ వెబ్‌ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోనే ఉంది. అయితే ఈ ఫీచర్‌ను వెబ్ యాప్‌లో కూడా తిరిగి తీసుకురావాలని చాలామంది వాట్సాప్‌ను అభ్యర్థించారు. వినియోగదారుల నుంచి రిక్వెస్ట్‌లు ఎక్కువ కావడంతో ఈ ఫీచర్‌ను వెబ్ యాప్‌లో తిరిగి రావాలని వాట్సాప్ భావిస్తోంది. సెలెక్ట్ చాట్స్ పేరుతో డెస్క్‌టాప్ యాప్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతుంది.

ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న సెలెక్ట్ చాట్ ఫీచర్ ప్రస్తుతం బీటా వర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఈ ఫీచర్ లైవ్‌లోకి రాగానే యూజర్లు ఒకే సారి ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను ఫార్వర్డ్ కానీ.. డిలీట్ కానీ చేయొచ్చు. వీటితో పాటు ఇతరులు పెట్టుకున్న స్టేటస్‌లపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా స్టేటస్ అప్‌డేట్ రిపోర్ట్ అనే ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరిచయం చేయనుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

GB Whatsapp | మీరు వాడుతున్న వాట్సాప్ అసలైనదేనా?

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Mobile Charging | మొబైల్ బ్యాటరీ ఎక్కువ కాలం రావాలా? ఈ టిప్స్ పాటించండి.

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News