Thursday, April 18, 2024
- Advertisment -
HomeLatest NewsUber ride via Whatsapp | ఇక వాట్సాప్‌లోనే ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌

Uber ride via Whatsapp | ఇక వాట్సాప్‌లోనే ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌

Uber ride via Whatsapp |మనలో చాలామంది ఉబెర్‌, ఓలా వంటి క్యాబ్‌ సర్వీసులను ఉపయోగించుకుని ఉంటారు. కొంతమంది రెగ్యులర్‌గా వీటిపై ఆధారపడుతుంటే.. మరికొందరు ఎప్పుడో గానీ యూజ్‌ చేయరు. రెగ్యులర్‌గా యూజ్‌ చేసుకునే వాళ్లకు ప్రాబ్లెం ఏమీ ఉండకపోవచ్చు.. కానీ ఎప్పుడో ఒకసారి వాడేవాళ్లు మొబైల్‌లో యాప్‌ను మెయింటైన్‌ చేయడం అంటే ఇబ్బందే. అందుకే చాలామంది అవసరం ఉన్నప్పుడే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటారు. తర్వాత డిలీట్‌ చేస్తుంటారు. కానీ ఇప్పుడు అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్‌ ద్వారానే రైడ్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని ఉబెర్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో నగరాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. తొందరలోనే దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో దీన్ని తీసుకొచ్చే ప్లాన్‌లో ఉంది.

వాట్సాప్‌ ద్వారా ఉబెర్‌ రైడ్‌ చేసుకోవాలంటే ఏం చేయాలి?

➣ ముందుగా ఉబెర్‌ అఫిషియల్‌ నంబర్ 7292000002 ను మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌ ముందు +91 జోడించడం తప్పనిసరి.

➣ వాట్సాప్‌లోకి వెళ్లి ఉబెర్‌ నంబర్‌ చాట్‌ను ఓపెన్‌ చేయాలి. అక్కడ చాట్‌బాట్‌తో చాటింగ్‌ చేసే వెసులుబాటు ఉంటుంది.

➣ ఒకవేళ ఉబెర్‌ నంబర్‌ను సేవ్‌ చేసుకోవడం ఇంట్రెస్ట్‌ లేకపోతే బ్రౌజర్‌లోకి వెళ్లి http://wa.me/9177292000002 యూఆర్‌ఎల్‌ ఎంటర్‌ చేయాలి. అప్పుడు ఉబెర్‌ చాట్‌బాట్ ఓపెన్‌ అవుతుంది.

➣ ఉబెర్‌ చాట్‌బాట్‌ ఓపెన్‌ అయ్యాక Hi అని మెసేజ్‌ చేయాలి.

➣ చాట్‌బాట్ నుంచి రెస్పాన్స్‌ వచ్చిన తర్వాత పికప్‌ అడ్రస్‌, డెస్టినేషన్‌ పాయింట్స్‌ను ఎంటర్‌ చేయాలి. పికప్‌ కోసం వాట్సాప్‌లో లైవ్‌ లొకేషన్‌ కూడా షేర్‌చేసే సదుపాయం ఉంది.

➣ క్యాబ్‌ ఎక్కడి నుంచి ఎక్కడికి అనే వివరాలు ఎంటర్‌ చేసిన తర్వాత రైడ్‌కు సంబంధించిన కాస్ట్‌తో పాటు క్యాబ్‌ ఎంత సేపట్లో వస్తుందనే వివరాలు కనిపిస్తాయి.

➣ క్యాబ్‌ ధర మీకు ఓకే అనిపిస్తే రైడ్‌ కన్ఫార్మ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు దగ్గరలో ఉన్న ఉబెర్‌ డ్రైవర్‌ రైడ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేయగానే ఒక నోటిఫికేషన్‌ వస్తుంది. వీటి ద్వారా క్యాబ్‌ స్టేటస్‌ కూడా తెలుసుకోవచ్చు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Whatsapp | వాట్సాప్‌ గ్రూపు నుంచి ఎగ్జిట్‌ అయినట్టు వస్తుందా? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి

Smartphone hacks | మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఐదు మార్పులు గమనించారా? అయితే మొబైల్‌ హ్యాక్‌ అయినట్టే

Whatsapp | పొరపాటున వాట్సాప్ మెసెజ్ డిలీట్ చేశారా? ఇలా రికవరీ చేసుకోండి

World’s smallest tv | వేలంతా కూడా లేని బుల్లి టీవీ.. దీని ధర ఎంతో తెలుసా

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News