Saturday, April 27, 2024
- Advertisment -
HomeLatest NewsMobile Apps | మీ మొబైల్లో యాప్స్ డిలీట్ చేశాక ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?

Mobile Apps | మీ మొబైల్లో యాప్స్ డిలీట్ చేశాక ఈ సమస్య ఎదుర్కొంటున్నారా?

Mobile Apps | స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ రకరకాల యాప్స్ను వినియోగిస్తుంటారు. వాటిలో కొన్ని ఎప్పటికీ అవసరం ఉంటే.. మరికొన్ని మాత్రం ఎప్పుడూ ఒకసారే అవసరం అవుతాయి. లేదా కొన్ని యాప్స్ నచ్చవు. అలాంటప్పుడు ఆ యాప్స్తో అవసరం తీరగానే అన్ఇన్స్టాల్ చేసేస్తుంటాం. అయినా సరే ఆ యాప్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్, అలర్ట్స్ తరచుగా వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి ఇవి ఇరిటేషన్ తెప్పించేలా కూడా ఉంటాయి. మరి మొబైల్లో నుంచి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా ఆ యాప్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఎందుకు వస్తున్నాయని ఆలోచించారా? దానికో కారణం ఉంది.

స్మార్ట్ఫోన్ వాడాలంటే కచ్చితంగా ఏదో ఒక ఈమెయిల్కు లింక్ చేయాల్సి ఉంటుంది. అలా లింక్ చేయడం వల్ల ఫోన్లో ఏ యాప్ ఇన్స్టాల్ చేసినా కూడా వాటికి జీమెయిల్ వివరాలు వెళ్తాయి. ఒకవేళ ఫోన్లో నుంచి యాప్ను డిలీట్ చేసినా కూడా ఆ యాప్స్కు అనుసంధానమైన జీమెయిల్ మాత్రం డిస్కనెక్ట్ అవ్వదు. దీనివల్లనే మనం యాప్స్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తుంటాయి. మరి ఆ యాప్స్ నుంచి జీమెయిల్ అకౌంట్ను ఎలా డిస్కనెక్ట్ చేయాలో తెలుసా? దీనికి ఒక ప్రాసెస్ ఉంది. అదెంటంటే..

  • ముందుగా మీ స్మార్ట్ఫోన్లోని సెట్టింగ్స్ను ఓపెన్ చేయాలి.
  • సెట్టింగ్స్ ఓపెన్ అయ్యాక అందులో ఉన్న గూగుల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
  • గూగుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కిందభాగంలో సెట్టింగ్స్ ఫర్ గూగుల్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కనెక్టెడ్ యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే జీమెయిల్కు ఏ యాప్స్ అనుసంధానమై ఉంటాయో తెలుస్తోంది.
  • వెంటనే ఆ యాప్స్ మీద క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్ను డిస్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Mobile Pin | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Mobile Charging | మీ మొబైల్ ఛార్జింగ్ తొందరగా అయిపోతుందా? ఈ యాప్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి

Instagram | ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెసేజ్‌లు వస్తున్నాయా? వాటిని ఇలా ఆపేయండి

Google Meet | ఆడియోను టెక్ట్స్‌గా మార్చే ఫీచర్‌ తీసుకొస్తున్న గూగుల్‌

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News